కోహ్లీ చేసిన రనౌట్‌ చూస్తే ఏదైనా గుర్తొస్తుందా?

తాజా వార్తలు

Published : 08/12/2020 02:12 IST

కోహ్లీ చేసిన రనౌట్‌ చూస్తే ఏదైనా గుర్తొస్తుందా?

ఇంటర్నెట్‌డెస్క్: ఫిట్‌నెస్‌, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌లో మేటి ఆటగాడిగా నిలుస్తూ భారత కెప్టెన్‌ విరాట్ కోహ్లీ సహచరులకు ప్రేరణగా నిలుస్తుంటాడు. మైదానంలో చిరుతులా కదులుతూ ప్రత్యర్థి స్కోరును కట్టడిచేస్తుంటాడు. అయితే ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ క్యాచ్‌లను అందుకోవడంలో విఫలమవుతున్నాడు. సులువైన క్యాచ్‌లను సైతం చేజార్చడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే రెండో టీ20లో క్యాచ్‌ను చేజార్చిన కోహ్లీ వెంటనే సమయస్ఫూర్తితో స్పందించి బ్యాట్స్‌మన్‌ వేడ్‌ను రనౌట్‌ చేశాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఎనిమిదో ఓవర్‌లో సుందర్‌ వేసిన బంతిని మాథ్యూ వేడ్‌ అంచనా వేయడంలో విఫలమై గాల్లోకి లేపాడు. అయితే సులువైన క్యాచ్‌ను కోహ్లీ జారవిడిచాడు. కానీ వెంటనే బంతిని వికెట్‌కీపర్‌ రాహుల్‌కు విసిరాడు. ఈ లోపు సింగిల్‌ కోసం ముందుకెళ్లి వెనక్కి మళ్లిన వేడ్‌ను రాహుల్ రనౌట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్‌లో వైరల్‌గా మారింది. అయితే ఈ రనౌట్ వీడియోను ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్‌ బ్రాడ్‌ రీట్వీట్ చేస్తూ.. ‘‘జేమ్స్‌ అండర్సన్‌.. దీన్ని చూస్తే ఏదైనా జ్ఞాపకం వస్తుందా?’’ అని వ్యాఖ్య జత చేశాడు.

కోహ్లీ చేసిన రనౌట్‌కు ఇంగ్లాండ్‌ పేసర్లు బ్రాడ్‌, అండర్సన్‌కు ఏం సంబంధమని ఆలోచిస్తున్నారా? సరిగ్గా కోహ్లీ తరహాలోనే పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రాడ్..‌ బాబర్ అజామ్‌ క్యాచ్‌ను చేజార్చి వెంటనే రనౌట్ చేశాడు. అండర్సన్‌ బౌలింగ్‌లో బాబర్‌ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను సీల్లీ మిడ్‌ఆన్‌లో ఉన్న బ్రాడ్ వదిలేశాడు. అయితే బాబర్‌కు బదులుగా నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న అబ్బాస్‌ను బ్రాడ్ రనౌట్‌ చేశాడు. సిడ్నీ వేదికగా జరిగిన రెండో టీ20లో కూడా కోహ్లీ క్యాచ్‌ను జారవిడిచి, ఇలానే రనౌట్‌ చేయడంతో అప్పటి సంఘటన గుర్తుచేసుకుంటూ బ్రాడ్ ట్వీట్ చేశాడు.

ఇదీ చదవండి

కోహ్లీ ర్యాంకుకే ఎసరు పెడుతున్న ‘మిత్రుడు’

క్లీన్‌స్వీప్ కోసం భారత్.. పరువు కోసం ఆసీస్‌Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని