close

తాజా వార్తలు

రోహిత్‌ సలహాతోనే సాధ్యమైంది: శివమ్‌

తిరువనంతపురం: టీమ్‌ఇండియా ఓపెనర్ రోహిత్‌ శర్మ సలహాతోనే వెస్టిండీస్‌పై స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేయగలిగానని భారత యువ ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబే తెలిపాడు. ‘మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేసే అవకాశం లభించింది. ఇది నాకు చాలా పెద్ద విషయం. దీంతో కాస్త ఒత్తిడికి లోనయ్యాను. కానీ, రోహిత్‌ భాయ్‌ నా సామర్థ్యాలపై నమ్మకం ఉంచుకోని, ప్రశాంతంగా ఆడమని చెప్పాడు. సిక్సర్‌ బాదిన తర్వాత ఆత్మవిశ్వాసం  పెరిగి నా సహజశైలిలో చెలరేగాను. ఏ మైదానంలోనైనా నేను సత్తాచాటగలను. అదే నా బలం. మ్యాచ్‌లో చేజార్చుకున్న అవకాశాలు ఎంతో కీలకమైనవి. ఇది ఆటలో భాగం. వారి ఫీల్డింగ్‌లో కూడా తడబాటు ఉంది. మేము మంచి స్కోరే సాధించాం. కానీ, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక ఓటమిపాలయ్యాం. తిరిగి పుంజుకొని నిర్ణయాత్మక మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను గెలుస్తాం’ అని దూబే అన్నాడు.

వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. దూబే 30 బంతుల్లో 54 పరుగులు సాధించాడు. మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో చెలరేగాడు. పొలార్డ్‌ వేసిన ఓవర్‌లోనే ఏకంగా మూడు సిక్సర్లు బాదాడు. అనంతరం బరిలోకి దిగిన వెస్టిండీస్‌ 18.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సిమన్స్‌ (67*), లూయిస్ (40)‌, పూరన్‌ (38*) రాణించారు. చివరి టీ20 మ్యాచ్‌ ముంబయిలో డిసెంబర్‌ 11న జరగనుంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.