close

తాజా వార్తలు

9000కు 46 దూరంలో హిట్‌మ్యాన్‌

గంగూలీ, సచిన్‌, లారా రికార్డులు బద్దలు కొట్టేందుకు సిద్ధం

ముంబయి: టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. రాజ్‌కోట్‌లో ఆస్ట్రేలియాతో తలపడే మ్యాచులో మరో 46 పరుగులు చేస్తే 9000 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. అత్యంత వేగంగా దీనిని సాధించిన మూడో క్రికెటర్‌గా ఈ ఘనతను అందుకుంటాడు. సచిన్‌ తెందుల్కర్‌, సౌరవ్‌ గంగూలీ, బ్రియన్‌ లారా వంటి దిగ్గజాల రికార్డులను బద్దలు కొట్టనున్నాడు.

ప్రస్తుతం రోహిత్‌ 215 ఇన్నింగ్సుల్లో 8,954 పరుగులతో ఉన్నాడు. 9000 మైలురాయిని అందుకొనేందుకు గంగూలీ 228, సచిన్‌ 235, లారా 239 ఇన్నింగ్స్‌లు తీసుకున్నారు. రాజ్‌కోట్‌లో గనక హిట్‌మ్యాన్‌ ఆ 46 పరుగులు చేస్తే విరాట్‌ కోహ్లీ (194), ఏబీ డివిలియర్స్‌ (205) తర్వాతి స్థానంలో నిలుస్తాడు. 2019లో అతడు వీరోచిత ఫామ్‌లో ఉన్నాడు. ఏకంగా 7 శతకాలు బాదాడు. అందులో ఐదు ప్రపంచకప్‌లోనే సాధించాడు. ఆ ఏడాదికి వన్డేల్లో అత్యధిక పరుగుల వీరుడి రికార్డూ అందుకున్నాడు. తాజాగా ఐసీసీ అతడికి ‘వన్డే క్రికెటర్‌’ వీరతాడు వేసిన సంగతి తెలిసిందే.

రాజ్‌కోట్‌లో రోహిత్‌ శతకం బాదితే వన్డేల్లో అత్యధిక శతకాలు సాధించిన నాలుగో ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం అతడు 28 సెంచరీలతో సనత్‌ జయసూర్య సరసన ఉన్నాడు. ముంబయి వన్డేలో విఫలమైన అతడు ఈ మ్యాచులో ఏడు సిక్సర్లు బాదితే అన్ని ఫార్మాట్లలో ఆసీస్‌పై 100 సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా సంచలనం సృష్టిస్తాడు. కంగారూలపై విరాట్‌, రోహిత్‌ కలిసి ఇప్పటి వరకు 991 పరుగులు చేశారు. వీరిద్దరూ శుక్రవారం మ్యాచులో 9 పరుగులు చేస్తే ఆసీస్‌పై 1000 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఐదో జంటగా ఘనత అందుకుంటారు.

ఇవీ చదవండి...

కాంట్రాక్టు దక్కని రోజే ధోనీ ఇచ్చిన సర్‌ప్రైజ్‌

టెన్నిస్‌ నిండా స్వలింగ సంపర్కులే!

దాదా దర్శకత్వంలో ధోనీ సినిమాకు క్లైమాక్సా?


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.