బీచ్‌లో సేద తీరుతున్న రోహిత్‌ జంట
close

తాజా వార్తలు

Updated : 29/10/2020 14:39 IST

బీచ్‌లో సేద తీరుతున్న రోహిత్‌ జంట

(photo: Rohit Sharma twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: గాయంతో గత రెండు మ్యాచ్‌లకు దూరమైన ముంబయి జట్టు కెప్టెన్‌ రోహిత్‌శర్మ దుబాయ్‌ బీచ్‌లో సేదతీరుతున్నాడు. భార్య రితిక, కూతురుతో కలిసి బీచ్‌లో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకున్నాడు. ‘బీచ్‌లో సాయంకాలం సేదతీరాం’ అని ఆ పోస్టులో పేర్కొన్నాడు. వీలు చిక్కినప్పుడల్లా రోహిత్‌ తన కుటుంబంతో సమయం గడిపేందుకు ఆసక్తి చూపిస్తుంటాడు. వాటికి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటాడు.

గాయం కారణంగా రోహిత్‌శర్మను సెలెక్టర్లు ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపిక చేయని విషయం తెలిసిందే. అయితే.. నెట్స్‌లో సాధన చేస్తున్న రోహిత్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టిన తరువాత అభిమానుల్లో పలు అనుమానాలకు తెరతీసింది. అసలు రోహిత్‌కు గాయమైందా..? ఒకవేళ అయితే నెట్స్‌లో సాధన ఎందుకు చేస్తున్నట్లు.? తర్వాతి మ్యాచ్‌కు జట్టులో రోహిత్‌ ఉంటాడా..? అని అందరిలోనూ సందేహాలు తలెత్తాయి. రోహిత్‌ ఫిట్‌నెస్‌పై సరైన స్పష్టత ఇవ్వాలని పలువురు క్రికెట్‌ ప్రముఖులు సైతం ప్రశ్నలు లేవనెత్తారు. ముంబయి జట్టు గానీ.. బీసీసీఐ గానీ ఇంతవరకూ రోహిత్‌ గాయంపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. రోహిత్‌ గైర్హాజరి నేపథ్యంలో మరో సీనియర్‌ ఆటగాడు కీరన్‌ పొలార్డ్‌ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకొని ముందుండి నడిపిస్తున్నాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని