హిట్‌మ్యాన్‌ @200
close

తాజా వార్తలు

Published : 10/11/2020 22:13 IST

హిట్‌మ్యాన్‌ @200

దుబాయ్‌ : బీసీసీఐ యూఏఈలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీ20 లీగ్‌ ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా ముంబయి జట్టు సారథి రోహిత్‌శర్మ ఓ ఘనత సాధించాడు. లీగ్‌ చరిత్రలో 200 మ్యాచులు ఆడిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. కెరీర్‌ తొలినాళ్లలో హైదరాబాద్‌(డక్కన్‌ ఛార్జర్స్‌)కు ప్రాతినిథ్యం వహించిన రోహిత్‌ను తర్వాత ముంబయి జట్టు యాజమాన్యం సొంతం చేసుకుంది. ఆ జట్టులో చేరి కీలక ఆటగాడిగా ఎదిగిన రోహిత్‌ అనతికాలంలోనే జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్ నాలుగు సార్లు ముంబయికి టైటిల్స్‌ను అందించాడు. ఇప్పటివరకూ లీగ్‌లోని అన్ని సీజన్లలో కలిపి రోహిత్‌ 38 అర్ధశతకాలు, ఓ శతకం చేశాడు. లీగ్‌లో 200 మ్యాచులు ఆడిన ఆటగాడిగా రోహిత్‌ కంటే ముందు ధోనీ తన పేరును లిఖించుకున్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని