close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 06/06/2020 18:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రితిక అప్పుడు ఎందుకు కన్నీరుపెట్టిందంటే..

అసలు కారణం చెప్పిన రోహిత్‌శర్మ

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ క్రికెట్‌ వన్డే చరిత్రలో మూడుసార్లు ద్విశతకం బాదిన ఏకైక బ్యాట్స్‌మన్‌ టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ. శ్రీలంకపై రెండు, ఆస్ట్రేలియాపై ఒక సారి ఈ ఘనత సాధించాడు. 2017 డిసెంబర్‌లో చివరిసారి శ్రీలంకపై మొహాలీలో ఈ అద్వితీయమైన రికార్డును నమోదు చేశాడు. ఈ సందర్భంగా ఆయన సతీమణి రితిక సజ్‌దేహ్‌ గ్యాలరీలో నిల్చొని కంటతడి పెట్టిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే, రితిక అప్పుడు ఎందుకు కన్నీరుపెట్టిందో ఎవరికీ తెలియదు. రోహిత్‌ మూడుసార్లు ఈ ఘనత సాధించడంతో ఆమె భావోద్వేగం చెందిందని అంతా అనుకున్నారు. కానీ, అసలు కారణం వేరే ఉందని రోహిత్‌శర్మ వెల్లడించాడు. తాజాగా అతడు మయాంక్‌ అగర్వాల్‌, శిఖర్‌ధావన్‌తో కలిసి వీడియోచాట్‌లో పాల్గొన్న సందర్భంగా రితిక కంటతడికి కారణమేంటో చెప్పాడు. 

‘ఆరోజు ఎందుకు అలా ఏడ్చావని రితికను అడిగాను. తనేం చెప్పిందంటే.. నేను 195 పరుగుల వద్ద ఉండగా ఒక సింగిల్‌ కోసం ప్రయత్నించాను. అప్పుడు డైవ్‌ చేయడంతో నా చేయి తిరిగిందని(ట్విస్ట్‌ అయిందని) భావించి కంగారు పడిందట. అది తనకు నిజంగా భయపడాల్సిన సంఘటనే. దాంతో నిజంగానే ఆమె భావోద్వేగం చెందింది’ అని రోహిత్‌ అసలు విషయం చెప్పుకొచ్చాడు. కాగా, ఆ మూడోసారి చేసిన ద్విశతకం తనకెంతో ప్రత్యేకమని హిట్‌మ్యాన్‌ తర్వాత చెప్పాడు. ఎందుకంటే ఆ రోజు తన వివాహ వార్షికోత్సవమని గుర్తుచేసుకున్నాడు. రోహిత్‌ 2013 నవంబర్‌ 2న ఆస్ట్రేలియాపై చిన్నస్వామి స్టేడియంలో తొలిసారి ద్విశతకం (209) బాదాడు. ఆ తర్వాత 2014 నవంబర్‌ 13న కోల్‌కతా ఈడెన్‌గార్డెన్స్‌లో శ్రీలంకపై 264 పరుగులు సాధించాడు. ఇది వన్డే చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ కావడం విశేషం. ఇక 2017 డిసెంబర్‌ 13న చివరిసారి అదే లంకపై 208 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లోనే రితిక కంటతడి పెట్టింది. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.