రోహిత్‌.. ఫిట్‌నెస్‌ సాధన షురూ
close

తాజా వార్తలు

Published : 19/11/2020 23:46 IST

రోహిత్‌.. ఫిట్‌నెస్‌ సాధన షురూ

బెంగళూరు: టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ ఫిట్‌నెస్‌ సాధన ఆరంభించాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో గురువారం నుంచి శిక్షణ మొదలు పెట్టాడు. సహచరుడు ఇషాంత్‌ శర్మతో కలిసి అతడు సాధన చేస్తున్నట్టు తెలిసింది.

ఐపీఎల్‌ ఆడుతుండగా రోహిత్‌శర్మ తొడకండరాల గాయంతో బాధపడ్డాడు. కొన్ని మ్యాచుల్లో విశ్రాంతి తీసుకున్నాడు. అదే సమయంలో ఆస్ట్రేలియా పర్యటనకు బీసీసీఐ సెలక్టర్లు జట్టును ఎంపిక చేశారు. ఫిట్‌నెస్‌ ఇబ్బందుల వల్ల హిట్‌మ్యాన్‌కు విశ్రాంతినిస్తున్నామని ప్రకటించారు. కానీ ఆ రోజు సాయంత్రమే రోహిత్‌ ప్యాడ్లు ధరించి మైదానంలో శిక్షణ మొదలుపెట్టడం కలకలం సృష్టించింది. అతడి గాయం పరిస్థితి ఏమిటో చెప్పాలని మాజీ క్రికెటర్లు గావస్కర్‌, సంజయ్‌ మంజ్రేకర్‌ తదితరులు డిమాండ్‌ చేశారు. ఇదే అదనుగా కోహ్లీతో విభేదాలున్నాయని వదంతులు వ్యాపించాయి.

ఫిట్‌నెస్‌ సాధించానని భావించిన రోహిత్‌ ఐపీఎల్‌ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ నుంచి క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టాడు. దిల్లీతో జరిగిన ఫైనల్లో 68 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. జట్టుకు ఐదోసారి ట్రోఫీ అందించి రికార్డు సృష్టించాడు. దీంతో అతడిని ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేశారు. పూర్తిగా కోలుకోవాలని భావించి అతడితో మాట్లాడాకే పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీస్‌లో విశ్రాంతి ఇస్తున్నామని బీసీసీఐ ప్రకటించింది.

తొలి టెస్టు తర్వాత సారథి కోహ్లీ జట్టుకు అందుబాటులో ఉండడు. సతీమణి అనుష్క శర్మకు జనవరి ప్రసవ సమయం కావడంతో పితృత్వపు సెలవులు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో రోహిత్‌ చేరిక జట్టుకు బలం చేకూర్చనుంది. చాన్నాళ్లుగా ఎన్‌సీఏలోనే శిక్షణ పొందుతున్న పేసర్‌ ఇషాంత్‌ శర్మ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు. రోహిత్‌ సైతం దేహ దారుఢ్యం సాధించగానే ఇద్దరూ కలిసి ఆసీస్‌కు బయల్దేరుతారు. అక్కడ 14 రోజులు క్వారంటైన్‌లో ఉండి జట్టును కలుస్తారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని