పాపకు రాక్షస బల్లుల్ని పరిచయం చేశాం: రోహిత్‌
close

తాజా వార్తలు

Published : 28/08/2020 01:10 IST

పాపకు రాక్షస బల్లుల్ని పరిచయం చేశాం: రోహిత్‌

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2020 కోసం ఉత్సాహంగా అబుదాబిలో అడుగుపెట్టిన ముంబయి ఇండియన్స్‌కు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. అక్కడికి చేరుకొని ఆరు రోజులు గడిచినా మరో వారం రోజులు క్వారంటైన్‌లోనే ఉండాల్సి వస్తోంది. ఎందుకంటే దుబాయ్‌, షార్జాతో పోలిస్తే అబుదాబిలో కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. అక్కడి నిబంధనలు సైతం వేరుగా ఉన్నాయి. దాంతో ఆ జట్టు సభ్యులు మళ్లీ తమ గదులకే పరిమితం అయ్యారు.

ఇతర ఆటగాళ్లకు ఇబ్బందిగా అనిపిస్తున్నా ముంబయి సారథి రోహిత్‌ శర్మ మాత్రం తన క్వారంటైన్‌ సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఎందుకంటే అతడు తన భార్య రితిక సజ్దె, కుమార్తె సమైరాతో కలిసి వచ్చాడు. కాగా తన ముద్దుల కుమార్తెకు ఈ రోజు రాక్షస బల్లులను పరిచయం చేశామని హిట్‌మ్యాన్‌ చెప్పాడు. అయితే ఆమె రెండు నిమిషాలు మాత్రమే వాటిని చూసిందని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నాడు.

‘జురాసిక్‌ వరల్డ్‌ ద్వారా సమ్మీ (సమైరా)కి రాక్షసబల్లులను పరిచయం చేశాం. ఇది ఎవరి ఆలోచనో మీరు సులభంగా గ్రహించగలరు. అయితే ఆమె మాత్రం రెండు నిమిషాలే చూసింది’ అని రోహిత్‌ వ్యాఖ్య పెట్టాడు. తన భార్య రితికనే ఈ సినిమా చూపించాలని కోరిందని పరోక్షంగా చెప్పాడు. యూఏఈకి బయల్దేరే ముందు కూడా హిట్‌మ్యాన్‌ కుమార్తెతో కలిసున్న చిత్రాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ‘సమైరా రెండో ఐపీఎల్‌కు సిద్ధమైంది’ అని పేర్కొన్నాడు. సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు ఐపీఎల్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని