close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 29/05/2020 14:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘హిట్‌’మ్యానే ఎందుకంటే?

ఒత్తిడిలో ప్రశాంతతే రోహిత్‌ విజయ రహస్యం: వీవీఎస్‌ లక్ష్మణ్‌

ముంబయి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అత్యంత విజయవంతమైన సారథి ఎవరంటే ముందుగా చెప్పే పేరు రోహిత్‌ శర్మ. నాలుగుసార్లు ముంబయి ఇండియన్స్‌ను విజేతగా నిలిపాడు. మహేంద్రసింగ్‌ ధోనీ (3 టైటిళ్లు) కన్నా ఒకడుగు ముందే ఉన్నాడు. ఒత్తిడి చిత్తు చేస్తున్నా ప్రశాంతంగా ఉండటమే హిట్‌మ్యాన్‌ విజయాలకు కారణమని వీవీఎస్‌ లక్ష్మణ్ అన్నారు. దక్కన్‌ ఛార్జర్స్‌ తరఫున తొలి ఐపీఎల్‌ ఆడినప్పటి నుంచే బ్యాట్స్‌మన్‌, నాయకుడిగా అతడు ఎదిగాడని పేర్కొన్నారు.

‘దక్కన్‌ ఛార్జర్స్‌కు ఆడుతున్నప్పుడే అతడు నాయకుడిగా ఎదిగాడు. తొలిసారి వచ్చినప్పుడు అతడో యువకుడు. టీమ్‌ఇండియా తరఫున అరంగేట్రం చేసి ఒక టీ20 ప్రపంచకప్‌ ఆడాడంతే. 2008 అరంగేట్ర ఐపీఎల్‌లో డీసీ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. అయినా రోహిత్‌ అద్భుతంగా ఆడాడు. ఒత్తిడి చిత్తుచేస్తున్నా మిడిలార్డర్‌లో మెరుగ్గా బ్యాటింగ్‌ చేసేవాడు’ అని లక్ష్మణ్ అన్నారు.

ప్రస్తుతం ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడు రోహిత్‌. 188 మ్యాచుల్లో 31.60 సగటుతో 4,898 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 109*. జట్టు కోసం అవసరమైతే ఓపెనర్‌, మిడిలార్డర్‌ అని ఆలోచించకుండా ఎక్కడైనా ఆడతాడు.

‘ప్రతి మ్యాచ్‌కు, ప్రతి విజయానికి రోహిత్‌ ఆత్మవిశ్వాస స్థాయి పెరిగేది. అనతి కాలంలోనే కీలక బృందంలో సభ్యుడిగా మారాడు. యువకులకు సాయం చేసేవాడు. అభిప్రాయాలు చెప్పేవాడు. నాయకుడిగా ఎదుగుతాడని చెప్పేందుకు ఇవన్నీ ముందస్తు శకునాలు. నా వరకైతే ఒత్తిడిని తట్టుకోవడమే అత్యంత కీలకం. ఒక్కసారి కాదు ఎన్నోసార్లు అలాంటి పరిస్థితుల్లో బ్యాటింగ్‌ చేసి ఎదిగాడు. అందుకే ఐపీఎల్‌ చరిత్రలో హిట్‌మ్యాన్‌ అత్యంత విజయవంతమైన నాయకుడు’ అని లక్ష్మణ్‌ స్పష్టం చేశారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.