close

తాజా వార్తలు

Updated : 01/12/2020 13:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సచిన్‌ సైక్లింగ్‌.. మారడోనా ఆట.. కైఫ్‌ బర్త్‌డే!

ఇంటర్నెట్‌డెస్క్‌: సచిన్‌ తెందూల్కర్‌ సైక్లింగ్‌, మారడోనా ఆట, కైఫ్‌ బర్త్‌డే ఏంటా అని ఆశ్చర్యపోకండి. ఇవన్నీ మాజీ క్రికెటర్లు సచిన్‌, గంగూలీ, సురేశ్‌ రైనా తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో పంచుకున్న విశేషాలు. లిటిల్‌ మాస్టర్‌ వీకెండ్‌ను ఎంజాయ్‌ చేస్తూ సరదాగా ఓ వ్యవసాయ క్షేత్రంలో సైక్లింగ్‌ చేసిన వీడియోను పోస్టు చేయగా, గంగూలీ ఇటీవల కన్నుమూసిన ఫుట్‌బాల్‌ దిగ్గజం డీగో మారడోనా ఆటను అభిమానులతో పంచుకున్నాడు. ఇక సురేశ్‌ రైనా తన సహచర ఆటగాడు, టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌ మహ్మద్‌ కైఫ్‌ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పాడు. 

* సమతూకం, ఫుట్‌వర్క్‌ అనే విషయాలు జీవితంలో ఎప్పటికీ ముఖ్యమైనవే.     -సచిన్‌ తెందూల్కర్‌

* అసలైన మేధావి డీగో. ఫుట్‌బాల్‌ గేమ్‌ను ఇతడి కంటే మెరుగ్గా ఆడే ఆటగాడిని నేను చూడలేదు.    -సౌరభ్‌ గంగూలీ

* పుట్టినరోజు శుభాకాంక్షలు కైఫ్ భాయ్‌. టీమ్‌ఇండియాకు, ఉత్తరప్రదేశ్‌ జట్టుకు మనం అందించిన విజయాలను గుర్తుచేసుకుంటున్నా. మీ భవిష్యత్‌ మొత్తం బాగుండాలని కోరుతున్నా.      -సురేశ్‌ రైనా


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన