close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 28/05/2020 02:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇర్ఫాన్‌ పఠాన్‌ హ్యాట్రిక్‌ దెబ్బతీసినా..

ముంబయి: 2006 పాక్‌ పర్యటనలో షోయబ్‌ అక్తర్‌ బౌన్సర్లను ఎదుర్కోలేక సచిన్‌ తెందూల్కర్‌ కళ్లు మూసుకున్నారని పాక్‌ మాజీ ఆటగాడు మహ్మద్‌ ఆసిఫ్‌ అంటున్నాడు. ఆఖరి టెస్టులో ఇర్ఫాన్‌ పఠాన్‌ హ్యాట్రిక్‌తో మానసికంగా దెబ్బతీసినప్పటికీ ఓటమి తప్పించుకున్నామని గుర్తుచేసుకున్నాడు.

ఈ పర్యటనలో తొలి టెస్టు ముల్తాన్‌, రెండో టెస్టు ఫైసలాబాద్‌లో నిర్వహించారు. నిర్ణయాత్మకమైన మూడో టెస్టు కరాచీలో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగింది. ‘టీమ్‌ఇండియా 2006 పర్యటనను గుర్తు చేసుకుంటే వారి బ్యాటింగ్‌ లైనప్‌ దుర్భేద్యంగా ఉంది. రాహుల్‌ ద్రవిడ్‌ పరుగుల వరద పారిస్తున్నాడు. ముల్తాన్‌లో సెహ్వాగ్‌ ఊచకోత కోశాడు. ఫైసలాబాద్‌ పోరులో రెండు జట్లు 600+ పరుగులు చేశాయి. ప్రత్యర్థి బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్ఠంగా ఉండటంతో మేం ఆందోళన చెందాం. ఎంఎస్‌ ధోనీ 7, 8 స్థానాల్లో వచ్చేవాడు’ అని ఆసిఫ్‌ తెలిపాడు.

మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పాక్‌ 245కు ఆలౌటైంది. కమ్రాన్‌ అక్మల్‌ (113) శతకంతో గౌరవప్రదమైన స్కోరు చేసింది. అయితే బౌలింగ్‌లో విజృంభించి టీమ్‌ఇండియాను 238కే పరిమితం చేసింది. ‘మ్యాచ్‌ మొదలవ్వగానే తొలి ఓవర్లోనే ఇర్ఫాన్‌ పఠాన్‌ హ్యాట్రిక్‌ తీశాడు. అది మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టింది. లోయర్‌ ఆర్డర్‌లో అక్మల్‌ శతకం చేయడంతో 240+ పరుగులు చేశాం’ అని ఆసిఫ్ అన్నాడు. 

రెండో ఇన్నింగ్స్‌లో ఫైసల్‌ ఇక్బాల్‌ (139) శతకంతో పాక్‌ 599/7 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన టీమ్‌ఇండియాను 265కే ఆలౌట్‌ చేసి 341 పరుగుల తేడాతో భారీ విజయం పొందింది. కాగా రెండో ఇన్నింగ్స్‌లో అక్తర్‌ బౌలింగ్‌ ధాటికి సచిన్‌ ఇబ్బంది పడ్డాడని ఆసిఫ్‌ అన్నాడు.

‘మేం ఫీల్డింగ్‌కు దిగాక షోయబ్‌ అక్తర్‌ ఎక్స్‌ప్రెస్‌ వేగంతో బెంబేలెత్తించాడు. నేను స్క్వేర్‌ లెగ్‌లో అంపైర్‌ వద్ద నిలబడ్డాను. అక్తర్‌ వేసిన రెండు మూడు బౌన్సర్లకు సచిన్‌ కళ్లు మూసుకోవడం ప్రత్యక్షంగా చూశాను. భారత ఆటగాళ్లు బ్యాక్‌ఫుట్‌తో ఆడతారు. మేం అందుకు అవకాశం ఇవ్వలేదు. చివరికి ఓటమిని తప్పించుకొని విజయం అందుకున్నాం’ అని ఆసిఫ్‌ పేర్కొన్నాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.