అదే నా ప్రయాణాన్ని అందంగా మలిచింది: సచిన్‌
close

తాజా వార్తలు

Updated : 11/12/2020 11:53 IST

అదే నా ప్రయాణాన్ని అందంగా మలిచింది: సచిన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: మానవులంతా తప్పులు చేస్తారని.. తానూ క్రికెట్‌ ఆడే రోజుల్లో చాలా తప్పులు చేశానని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ పేర్కొన్నాడు. తాజాగా #AskSachin పేరిట యూట్యూబ్‌ ఛానల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాస్టర్‌ బ్లాస్టర్‌ పాల్గొన్నాడు. క్రికెట్‌ ఆడే రోజుల్లో మీరు‌ ఏం తప్పులు చేశారు? వాటిని ఎలా అధిగమించారు? అని ఓ అభిమాని ప్రశ్నించాడు.

‘మనమంతా మనుషలమే. ఎవరైనా తప్పులు చేస్తారు. వాటి నుంచి నేర్చుకుంటేనే పైకి వస్తారు. నేను మైదానంలో ఎప్పుడైనా తప్పులు చేస్తే తర్వాతి రోజు నెట్స్‌కు వెళ్లి వాటి మీద దృష్టిసారించేవాడిని. ఆ తప్పుల్ని సరిచేసుకోవడమే నా ప్రయాణాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దింది. ఎవరైనా ఏదైనా నేర్చుకోడానికి సిద్ధపడితే ఆ విషయంలో మరింత పరిజ్ఞానం పొందుతారు. నాకు తెలియని విషయాల గురించి తెలుసుకోవడానికి అవతలి వ్యక్తి చిన్నా, పెద్దా అనే భేదం చూపేవాడిని కాదు. 16 ఏళ్ల ప్రాయంలో టీమ్‌ఇండియాకు ఎంపికైనప్పటి నుంచి ఆఖరి రోజు వరకూ ఇతరులతో మాట్లాడటానికే ప్రయత్నించాను. ఇతరులతో సమాచారం ఇచ్చిపుచ్చుకున్నాను. అదే నేను మరింత ఉత్తమ ఆటగాడిగా మారేందుకు ఉపయోగపడింది’ అని తెందూల్కర్‌ వివరించాడు.

ఇక మీరాడిన మ్యాచ్‌ల్లో ఏ ఆట హైలైట్స్‌ చూడటానికి అమితంగా ఇష్టపడతావని మరో అభిమాని ప్నశ్నించగా.. 1998 షార్జాకప్‌లో ఆస్ట్రేలియాపై ఆడిన సెమీఫైనల్‌, ఫైనల్స్‌ అంటే తనకెంతో ఇష్టమని తెలిపాడు. నాటి పరిస్థితుల్లో ఆయా మ్యాచ్‌ల స్కోర్లు విశేషకరమైనవని పేర్కొన్నాడు. అలాగే 2003 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై ఆడిన 98 పరుగుల చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ కూడా చాలా ఇష్టమని.. ఆయా మ్యాచ్‌ల హైలైట్స్‌ చూస్తే మజా వస్తుందని మాజీ సారథి వివరించాడు.

ఇవీ చదవండి..

ఐపీఎల్‌ ఆర్జనలో ధోనీనే నం.1

మళ్లీ ముంబయి ఇండియన్స్‌కు పార్థివ్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని