ఇలాగైతే ఐసీసీ దృష్టిసారించాల్సిందే: సచిన్‌
close

తాజా వార్తలు

Published : 29/12/2020 01:14 IST

ఇలాగైతే ఐసీసీ దృష్టిసారించాల్సిందే: సచిన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: అంతర్జాతీయ క్రికెట్‌లో అమలు చేస్తున్న డెసిషన్‌ రివ్యూ సిస్టమ్‌(డీఆర్‌ఎస్‌)లో ‘అంపైర్స్‌ కాల్‌’ విధానాన్ని లోతుగా సమీక్షించాలని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ ఐసీసీకి విజ్ఞప్తి చేశాడు. బాక్సింగ్‌ డే టెస్టులో సోమవారం టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా క్రికెటర్లు పలువురు ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయాలపై నమ్మకం లేక డీఆర్‌ఎస్‌కు వెళ్లిన నేపథ్యంలో సచిన్‌ ఇలా స్పందించాడు. మైదానంలో అంపైర్ల నిర్ణయాలపై అసంతృప్తితోనే ఆటగాళ్లు డీఆర్‌ఎస్‌కు వెళ్తున్నారని, అందువల్ల ‘అంపైర్‌ కాల్స్‌’ విధానాన్ని సమీక్షించాలని మాస్టర్‌ బ్లాస్టర్‌ ట్వీట్‌ చేశాడు. 

ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఎవరైనా ఆటగాడు అంపైర్‌ నిర్ణయంపై అసంతృప్తి చెందితే డీఆర్‌ఎస్‌కు వెళ్లే అవకాశం ఉందనే సంగతి అందరికీ తెలిసిందే. అందులో కచ్చితమైన ఫలితం తేలకపోతే అంపైర్‌దే తుది నిర్ణయంగా భావిస్తారు. అలాగే ఎల్బీడబ్ల్యూ అంశాల్లోనూ ఏ బ్యాట్స్‌మెన్‌ అయినా ఔటో కాదో అనే విషయంపై అంపైర్లు మొదట తమ అభిప్రాయం తెలుపుతారు. ఒకవేళ దాంట్లో అసంతృప్తి ఉంటే ఆటగాళ్లు రివ్యూకు వెళతారు. అయితే, ఇక్కడ తొలుత పరీక్షించేది.. బంతి సరైన లైన్‌లో పడిందా లేదా అనే అంశాన్ని గమనిస్తారు. ఆ తర్వాత ఆ బంతి వికెట్లను తాకుతూ వెళ్తుందా లేదా అనేది పరిశీలిస్తారు. ఈ క్రమంలోనే సగం కన్నా ఎక్కువ మొత్తంలో బంతి వికెట్లను తాకనట్లు కనపడితే అది అంపైర్‌ నిర్ణయంపైనే ఆధారపడుతుంది. అచ్చం ఇలాగే సోమవారం ఆటలో ఓ ఘటన చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ జో బర్న్స్‌(4) ఒకానొక సందర్భంలో బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీ అయినట్లు కనిపించాడు. అంపైర్‌ నాటౌట్‌ ఇవ్వడంతో టీమ్‌ఇండియా రివ్యూకు వెళ్లింది. రీప్లేలో బంతి వికెట్లకు తాకేలా కనిపించినా సగానికి పైగా అవతలివైపు వెళ్లింది. దీంతో అంపైర్‌దే తుది నిర్ణయంగా మారింది. దీనిపై భారత ఆటగాళ్లు అసంతృప్తి చెందారు.

ఇవీ చదవండి..
రాహులో రాహులా.. 2020 సూపర్‌ హిట్
ఆధిపత్యం ఇలాగే ఉంటే.. విజయం మనదే 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని