సచిన్‌ పదేళ్ల పిల్లాడిలా అనిపించాడు: షేన్‌వార్న్‌

తాజా వార్తలు

Published : 26/08/2020 01:28 IST

సచిన్‌ పదేళ్ల పిల్లాడిలా అనిపించాడు: షేన్‌వార్న్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత దిగ్గజ క్రికెటర్‌ సచిన్ తెందుల్కర్‌ను మైదానంలో తొలిసారి చూసినప్పుడు పదేళ్ల పిల్లాడిలా అనిపించాడని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ అన్నాడు. పాకిస్థాన్‌×ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన టెస్టులో వ్యాఖ్యాతగా ఉన్న అతడు సచిన్‌తో ఉన్న జ్ఞాపకాలను పంచుకున్నాడు. 1991-92లో ఆస్ట్రేలియాలో భారత్‌ పర్యటించినప్పుడు సచిన్‌ను మొదటిసారి చూశానని గుర్తు చేసుకున్నాడు. పర్యటనలో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో సచిన్ అజేయంగా 148 పరుగులు సాధించి మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు. ఆ మ్యాచ్‌తోనే షేన్‌ వార్న్‌ తన అంతర్జాతీయ కెరీర్‌ను మొదలుపెట్టాడు.

‘‘సచిన్‌ను తొలిసారిగా చూసినప్పుడు అతడి వయస్సు 21 సంవత్సరాలు. కానీ, అతడు పదేళ్ల పిల్లాడిలా అనిపించాడు. అతడిలో ఏదో ప్రత్యేకత ఉందనిపించింది. ఆ మ్యాచ్‌లో సచిన్‌ చిచ్చర పిడుగులా మైదానం నలుమూలలా బౌండరీలు బాదాడు. అతడి ఆటలో సొగసు ఉంటుంది. అందుకే అతడు అద్భుతమైన బ్యాట్స్‌మన్’’ అని వార్న్‌ కొనియాడాడు. బ్యాట్స్‌మెన్‌ దూకుడుకి కళ్లెం వేయాలంటే ప్రణాళికతో బంతులు వేయాలని షేన్‌ వార్న్‌ సూచించాడు. ‘‘చెత్త బంతికి కూడా గొప్ప బ్యాట్స్‌మెన్‌ సులువుగా పరుగులు చేస్తారు. ఫీల్డర్ల మధ్యలో ఉన్న ఖాళీని చూసి బౌండరీలు సాధిస్తారు. దీంతో బౌలర్‌పై ఒత్తిడి పెరిగిపోతుంది. అయితే కేవలం పరుగులు ఇవ్వకూడదనే ధోరణితో కాకుండా మన ప్రణాళికతో బంతులు వేయాలి. అలా చేస్తే బ్యాట్స్‌మెన్ దూకుడును నియంత్రించవచ్చు’’ అని వార్న్‌ తెలిపాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని