సంజూయే తర్వాతి ధోనీ: కాదన్న గౌతీ!

తాజా వార్తలు

Published : 28/09/2020 10:16 IST

సంజూయే తర్వాతి ధోనీ: కాదన్న గౌతీ!

(Twitter/Sanjusamson)

ఇంటర్నెట్‌డెస్క్‌: కళ్లు చెదిరే సిక్సర్లతో షార్జాలో వరుసగా రెండో అర్ధశతకం బాదిన సంజు శాంసన్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. పంజాబ్‌ నిర్దేశించిన 224 పరుగుల లక్ష్య ఛేదనలో అతడి బ్యాటింగ్‌ను అందరూ కీర్తిస్తున్నారు. రాజస్థాన్‌ సారథి స్టీవ్‌స్మిత్‌ నుంచి మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు ఈ యువ క్రికెటర్‌ బ్యాటింగ్‌కు ఫిదా అయ్యారు.

పదమూడో సీజన్‌లో సంజు ఇప్పటికే 159 పరుగులు చేశాడు. పరుగుల వీరుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఏకంగా 16 సిక్సర్లు, 5 బౌండరీలు బాదాడు. ఈ సీజన్‌లో ఇన్ని సిక్సర్లు ఇప్పటి వరకు ఎవరూ కొట్టలేదు. ఇక ఆదివారం పంజాబ్‌పై అతడు చెలరేగిన తీరు నభూతో న భవిష్యతి. లీగ్‌ చరిత్రలోనే అత్యధిక లక్ష్యమైన 224 పరుగుల్ని రాజస్థాన్‌ ఛేదించిందంటే అది సంజూ వల్లే. అద్భుతంగా ఆడుతున్న అతడిని అందరూ ప్రశంసిస్తున్నారు. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ సైతం అతడిని అభినందించారు. భారత క్రికెట్లో తర్వాతి ధోనీ అవుతాడని అతడికి ఎప్పుడో చెప్పానని ట్వీట్‌ చేశారు.

‘రాజస్థాన్‌కు ఇది తిరుగులేని విజయం. దశాబ్దకాలంగా సంజు శాంసన్‌ నాకు తెలుసు. ఏదో ఒకరోజు తర్వాతి ధోనీగా నువ్వు అవతరిస్తావని 14 ఏళ్లప్పుడే అతడికి చెప్పా. ఆ రోజు ఇప్పుడొచ్చింది. లీగ్‌లో రెండు అద్భుతమైన అర్ధశతకాల తర్వాత ఓ ప్రపంచస్థాయి ఆటగాడు వచ్చాడని మీ అందరికీ తెలిసింది’ అని శశిథరూర్‌ ట్వీట్‌ చేశారు. కాగా ఆయన అభిప్రాయంతో భాజపా ఎంపీ, మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఏకీభవించలేదు. ‘మరొకరిలా అవ్వాల్సిన అవసరం సంజు శాంసన్‌కు లేదు. అతనెప్పుడూ భారత క్రికెట్లో సంజు శాంసన్‌గానే ఉండాలి’ అని గౌతీ అన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని