close
Array ( ) 1

తాజా వార్తలు

షెఫాలీకి పూర్తి స్వేచ్ఛనిచ్చాం: శిఖా

పెర్త్‌: ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా యువ సంచలనం షెఫాలీవర్మకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని సీనియర్‌ పేసర్‌ శిఖా పాండే అన్నారు. సోమవారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో పోరులో మహిళా భారత్‌ 18 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఓపెనర్‌ షెఫాలీ(39; 17 బంతుల్లో 2x4, 4x6) మరోసారి తన దూకుడు బ్యాటింగ్‌తో అలరించింది. మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడిన శిఖా.. పొట్టి ప్రపంచకప్‌లో తనదైన దూకుడు శైలిలో ఆడాలని జట్టు యాజమాన్యం షెఫాలీతో అన్నట్లు పేర్కొన్నారు.

‘తన ఆటతీరులో మార్పులు చేసుకోవాలని షెఫాలీని మేం అడగలేదు. భయం లేకుండా తను ఆడేందుకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం. తను 16 ఏళ్లలోనే అద్భుతంగా రాణిస్తోంది. ఆ వయసులో నేను క్రికెటర్‌గా శిక్షణ కూడా తీసుకోలేదు. తనలాంటి భయం లేని యువ క్రికెటర్లు జట్టులో ఉండడం సంతోషంగా ఉంది. జట్టు కోసం వాళ్లు ఏం చేశారనేది చూస్తే చాలా గొప్పగా అనిపిస్తుంది’ అని శిఖాపాండే చెప్పారు. 

బంగ్లాదేశ్‌పై చేసిన 142 పరుగులు.. లక్ష్యాన్ని కాపాడుకోడానికి మంచి స్కోరే అనుకున్నామని, తమ బౌలర్లపై అంత నమ్మకముందని శిఖా అన్నారు. బంగ్లాకు ఆ స్కోరు సరిపోతుందని భావించినట్లు చెప్పారు. అనంతరం కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మాట్లాడుతూ తదుపరి మ్యాచ్‌కు ఓపెనర్‌ స్మృతి మంధాన కోలుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. అనారోగ్యం కారణంగా మంధాన బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు. ఆమె స్థానంలో ఓపెనింగ్‌ చేసిన తానియా భాటియా(2) నిరాశ పర్చినా.. షెఫాలీ, జెమీమా రోడ్రిగ్స్‌(34; 37 బంతుల్లో 2x4, 1x6) బాధ్యతాయుతంగా ఆడారు. భారత్‌ తొలుత 142 పరుగులు చేయగా తర్వాత బ్యాటింగ్‌ చేసిన బంగ్లా 124 పరుగులకే పరిమితమైంది. దీంతో టీమ్‌ఇండియా మహిళా జట్టు మెగా ఈవెంట్‌లో రెండో విజయం నమోదు చేసింది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.