close

తాజా వార్తలు

Published : 08/08/2020 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సర్ఫరాజ్‌ బూట్లు తేవడంపై అక్తర్‌ ఆగ్రహం

 

ఇస్లామాబాద్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు పాకిస్థాన్‌ మాజీ సారథి సర్ఫరాజ్‌ అహ్మద్‌ తమ బ్యాట్స్‌మన్‌ షాదబ్‌ ఖాన్‌కు కూల్‌డ్రింక్స్‌, బూట్లు తీసుకురావడంపై ఆ జట్టు మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నాలుగేళ్లు జట్టును నడిపించిన సారథి, పాకిస్థాన్‌కు ఛాంపియన్స్‌ ట్రోఫీ అందించిన ఆటగాడితో అలాంటి పనులు చేయించడం సరికాదని ఓ టీవీ కార్యక్రమంలో అన్నాడు. అలాగే జట్టు యాజమాన్యంపై అసహనం వ్యక్తంచేశాడు. సర్ఫరాజ్‌ తనకు తానుగా అలాచేసి ఉంటే పర్వాలేదని, కానీ అతడిని ఆపాల్సిందని అక్తర్‌ అభిప్రాయపడ్డాడు. తాను ఆడే రోజుల్లో మాజీ సారథి వసీం అక్రమ్‌ ఎప్పుడూ తనకు బూట్లు అందించలేదని పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. 

అనంతరం ఇదే విషయంపై స్పందించిన పాక్‌ హెడ్‌ కోచ్‌, నేషనల్‌ సెలెక్టర్‌ మిస్బా ఉల్‌ హక్‌.. సర్ఫరాజ్‌ చేసింది తప్పేం కాదన్నాడు. అలా చేయడం ద్వారా అతడు ఎంత గొప్ప ఆటగాడనే విషయం తెలుస్తుందని వ్యాఖ్యానించాడు. క్రికెట్‌ ఆడేటప్పుడు ఆ సమయంలో ఎవరు అందుబాటులో ఉంటే వాళ్లు మైదానంలోని ఆటగాళ్లకు సహాయం చేస్తారని చెప్పాడు. ఆ విషయాన్ని సర్ఫరాజ్‌ కూడా నామోషిగా భావించడం లేదన్నాడు. ఇదిలా ఉండగా, రెండో తొలి ఇన్నింగ్స్‌లో పాక్‌ 326 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ మసూద్‌ (156) భారీ శతకంతో చెలరేగాడు. అనంతరం బ్యాటింగ్‌ ఆరంభించిన ఇంగ్లాండ్‌ ఆట పూర్తయ్యే సరికి నాలుగు వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. ఓవర్‌ నైట్‌ స్కోరుతో పోప్‌(46), బట్లర్‌(15) శుక్రవారం మూడో రోజు ఆట ఆరంభించగా కొద్ది సేపటికే ఇంగ్లాండ్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. అర్ధ శతకం తర్వాత నసీమ్‌ షా బౌలింగ్‌లో షాదబ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.