close
Array ( ) 1

తాజా వార్తలు

కోహ్లీ వేళ్లు విరిగిపోయాయి: శ్రేయస్‌ అయ్యర్‌

ముంబయి: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఫొటోకు మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ హాస్యాస్పద కామెంట్‌ చేశాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు సందర్భంగా టాస్‌ వేసే సమయంలో.. కోహ్లీ మైదానంలో ఒక విచిత్రమైన స్టెప్‌ వేశాడు. టీమ్‌ఇండియా బ్లేజర్‌ ధరించి రెండు చేతులను చాచి డాన్స్‌ చేస్తున్నట్లు కనిపిస్తున్న ఆ ఫొటోను బీసీసీఐ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ సందర్భంగా ఆ ఫొటోకు మంచి కామెంట్లు పెట్టమని బీసీసీఐ అభిమానులను కోరింది. ఉత్తమ కామెంట్లను అక్కడ పేర్కొంటామని చెప్పడంతో శ్రేయస్‌ అయ్యర్‌ స్పందించాడు. తనదైన శైలిలో కామెంట్‌ చేసి జోక్‌ చేశాడు.

విరాట్‌కోహ్లీ చేతి వేళ్లు విరిగిపోయాయని శ్రేయస్‌ తన కామెంట్‌లో పేర్కొన్నాడు. ఎందుకంటే ఆ ఫొటోలో కోహ్లీ రెండు చేతులు చాచినట్లు కనిపిస్తుండగా.. వేళ్లు మాత్రం కిందకు వేలాడుతున్నట్లు ఉన్నాయి. దీంతో శ్రేయస్‌ అలా ఫన్నీగా స్పందించాడు. ఇదిలా ఉండగా శ్రేయస్‌ ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమ్‌ఇండియాకు మిడిల్‌ఆర్డర్‌లో వెన్నెముకలా నిలుస్తున్నాడు. ఈ మధ్య కివీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ ఆకట్టుకున్నాడు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
VITEEE 2020
besttaxfiler
HITS2020
Saket Pranamam
dr madhu

Panch Pataka

దేవతార్చన