close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 27/09/2020 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

శుభ్‌మన్ అర్ధశతకం.. ‌కోల్‌కతా విజయం

హైదరాబాద్‌కు రెండో ఓటమి

ఇంటర్నెట్‌డెస్క్‌: హైదరాబాద్‌తో తలపడిన రెండో మ్యాచ్‌లో కోల్‌కతా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వార్నర్‌ సేన నిర్దేశించిన 143 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 18 ఓవర్లలో ఛేదించింది. దీంతో హైదరాబాద్‌ వరుసగా రెండో టీ20లోనూ ఓటమిపాలై పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయింది. ఛేదనలో ఆరంభంలోనే తడబడిన కోల్‌కతాను శుభ్‌మన్‌గిల్‌(70; 62 బంతుల్లో 5x4, 2x6), ఇయాన్‌ మోర్గాన్‌(42; 29 బంతుల్లో 3x4, 2x6) ఆదుకున్నారు. 53 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఆ జట్టును మరో వికెట్‌ పడకుండా గెలిపించారు. వీరిద్దరూ అజేయంగా 92 పరుగులు జోడించడంతో కోల్‌కతా ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందుకుంది. అంతకుముందు సునీల్‌ నరైన్‌(0), కెప్టెన్‌ దినేశ్‌ కార్తిక్‌(0) డకౌట్‌గా వెనుతిరిగారు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన నితీశ్‌ రాణా(26; 13 బంతుల్లో 6x4) మెరుపు బ్యాటింగ్‌ చేసినా అనుకోకుండా నటరాజన్‌ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు. తర్వాత మోర్గాన్‌తో జోడీ కట్టిన శుభ్‌మన్‌ అర్ధశతకం సాధించడమే కాకుండా కోల్‌కతాకు ఘన విజయాన్ని అందించాడు. హైదరాబాద్‌ బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌, నటరాజన్‌, రషీద్‌ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

ఇక టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 142 పరుగులే చేసింది. కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో వార్నర్‌సేన ఏ దశలోనూ భారీ స్కోర్‌ సాధించేలా కనిపించలేదు. 24 పరుగుల వద్దే కమిన్స్‌ బౌలింగ్‌లో జానీ బెయిర్‌స్టో (5) బౌల్డవ్వగా, తర్వాత 59 పరుగుల వద్ద డేవిడ్‌ వార్నర్‌ ‌(36; 30 బంతుల్లో 2x4, 1x6) రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. ధాటిగా ఆడే క్రమంలో అతడు 10వ ఓవర్‌ తొలి బంతికే వరున్‌ చక్రవర్తికి రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం మనీష్‌ పాండే (51; 38 బంతుల్లో 3x4, 2x6), వృద్ధిమాన్‌ సాహా (30; 31 బంతుల్లో 1x4, 1x6) వికెట్‌ కాపాడుకునేందుకే ప్రాధాన్యం ఇవ్వడంతో స్కోరు బోర్డు నెమ్మదించింది. చివర్లో మనీష్‌ అర్ధశతకం సాధించాక రసెల్‌ బౌలింగ్‌లో అనూహ్య రీతిలో ఔటయ్యాడు. ఫుల్‌టాస్‌ బంతికి అప్రయత్నంగానే బ్యాట్‌ తగలడంతో అది గాల్లోకి లేచింది. దీంతో రసెల్ క్యాచ్‌ అందుకొని అతడిని పెవిలియన్‌ పంపాడు. చివర్లో మహ్మద్‌ నబి (11; 8 బంతుల్లో 2x4) రెండు బౌండరీలు బాదగా హైదరాబాద్‌ స్కోర్‌ 142 పరుగులకు చేరింది. కోల్‌కతా జట్టులో ఏడుగురు బౌలింగ్‌ చేయడం గమనార్హం. అయితే, వీరిలో కమిన్స్‌, రసెల్‌, వరున్‌ మాత్రమే తలో వికెట్‌ తీశారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.