close

తాజా వార్తలు

క్రికెటర్ల ‘బంధం’ బలపడేందుకే...

దిల్లీ: భారత్‌-ఏ, అండర్‌-19 కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ ఎంపికైనప్పటి నుంచి ఆటగాళ్ల మధ్య బంధం బలపడే (టీమ్‌ బాండింగ్‌) కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. 2020 జనవరిలో అండర్‌-19 ప్రపంచకప్‌ జరుగుతున్న సందర్భంగా ఇప్పటికే జట్టును ఎంపిక చేశారు. వారందరూ కర్ణాటకలోని నాగర్‌హోల్‌ జాతీయ ఉద్యానవనంలోని కబిని ఫారెస్ట్‌ సఫారీలో రెండు రోజులు గడపనున్నారు. ద్రవిడ్‌ నేతృత్వంలోనే ఈ కార్యక్రమం రూపొందించామని బీసీసీఐ జీఎం సాబా కరీమ్‌, ఎన్‌సీఏ సీవోవో తుఫాన్‌ ఘోష్‌ తెలిపారు.

‘ఇది రెండు రోజుల టీమ్‌ బాండింగ్‌ కార్యక్రమం. బూట్‌ క్యాంప్‌ కాదు. ఇంతకు ముందు భారత్‌-ఏ జట్టు సైతం నాగర్‌హోల్‌ ఉద్యానవనానికి వచ్చింది. అండర్‌-19, ‘ఏ’ జట్లకు క్రమం తప్పకుండా వీటిని నిర్వహిస్తుంటాం. సీనియర్‌ జట్టుకైతే సొంత షెడ్యూలు ఉంటుంది. అండర్‌-19 ఆటగాళ్లు దేశంలోని నలుమూలల నుంచి వస్తారు. వారి మధ్య స్నేహం, నమ్మకం, బంధం, కలివిడితనం పెరిగేందుకు ఇవి ఉపయోగపడతాయి. భిన్నమైన పరిస్థితులకు ఆటగాళ్లు ఎలా స్పందిస్తారో తెలుస్తుంది. ఈ రోజు టైగర్‌ సఫారీని వారు బాగా ఆస్వాదించారు. కొన్ని చోట్ల పులులను గుర్తించారు’ అని ఘోష్‌ తెలిపారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.