close

తాజా వార్తలు

Published : 26/11/2020 22:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొత్త హోటల్‌కు చేరుకున్న కోహ్లీసేన

క్వారంటైన్‌ ముగించుకొని బయో బుడగలోకి ప్రవేశం

సిడ్నీ: ఆస్ట్రేలియాలో టీమ్‌ఇండియా క్వారంటైన్‌ ముగిసింది. సిడ్నీ శివారు ప్రాంతం నుంచి గురువారం జట్టు సభ్యులంతా కొత్త హోటల్‌కు మారారు. ఇక నుంచి పూర్తిగా బయో బుడగలోనే ఉండనున్నారు. సమవుజ్జీల సమరంలో భాగంగా తొలి పోరు శుక్రవారమే జరగనుంది. సిడ్నీ వేదికగా భారత కాలమానం ప్రకారం ఉదయం 9:10 గంటలకు భారత్‌, ఆస్ట్రేలియా తొలి వన్డేలో తలపడతాయి.

దుబాయ్‌ నుంచి రాగానే టీమ్‌ఇండియా సభ్యులు, సహాయ సిబ్బంది 14 రోజుల పాటు సిడ్నీ ఒలింపిక్‌ పార్క్‌లోని పుల్‌మ్యాన్‌ హోటల్లో క్వారంటైన్‌ అయ్యారు. కేవలం సాధన చేస్తున్నప్పుడు మాత్రమే వారు మైదానంలో కలిశారు. అక్కడా పక్కపక్కన ఎవరినీ కూర్చోనీయలేదు. మైదానానికి తీసుకొచ్చేందుకు వేర్వేరు బస్సులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రెండు వారాల క్వారంటైన్‌ పూర్తవ్వడంతో ఎప్పుడూ దిగే ఇంటర్‌ కాంటినెంటల్‌ హోటల్‌కు ఆటగాళ్లు వెళ్లారు. కొన్నేళ్లుగా ఆసీస్‌ పర్యటనల్లో భారత ఆటగాళ్లు ఇదే హోటల్లో బస చేయడం ఆనవాయితీగా మారింది.

బయో బుడగలో అడుగుపెట్టడంతో ఆటగాళ్లకు కాస్త స్వేచ్ఛ దొరికింది. నియంత్రణ వాతావరణంలో సహచరులతో కలిసి భోజనం చేయొచ్చు. క్వారంటైన్లో అయితే అలా కూడా కుదర్లేదు. అందుకే ఆ 14 రోజులు చాలా కఠినంగా గడిచిందని టీమ్‌ఇండియా వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. ‘క్వారంటైన్లో గదిలో ఒంటరిగా గడపడం సవాల్‌గా అనిపించింది. ఆటగాళ్లను కలిసినప్పుడు, సాధన చేసినప్పుడు సంతోషం వేసేది. అక్కడ సరదాగా ఉండేవాళ్లం. మళ్లీ గదికి వెళ్లాక ఒంటరితనం వేధించేది’ కేఎల్‌ చెప్పాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన