close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 26/03/2020 02:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారత అథ్లెట్లు నిరాశ చెందొద్దు: కిరణ్‌ రిజుజు

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌ను ఏడాది పాటు వాయిదా వేయాలని అంతర్జాతీయ ఒలింపిక్‌ సమాఖ్య (ఐఓసీ) తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజుజు స్వాగతించారు. ‘‘మహమ్మారి కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్‌ను ఐఓసీ వాయిదా వేయాలనే తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అథ్లెట్లకు ఇది ఎంతో శ్రేయస్కరం. భారత అథ్లెట్లు నిరాశచెందొద్దు. 2021లో భారత్‌ ఎక్కువ పతకాలను సాధించేలా అవకాశాలు సృష్టిస్తాం’’ అని ట్వీట్‌ చేశారు.

కరోనా వైరస్‌తో పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా టోక్యో 2020 ఒలింపిక్స్‌ను వాయిదా వేస్తున్నట్లు ఐఓసీ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. షెడ్యూలు ప్రకారం ఒలింపిక్స్‌ ఈ ఏడాది జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరగాల్సి ఉంది. కానీ ఐఓసీ అధ్యక్షుడు థామస్‌ బాక్‌, జపాన్‌ ప్రధాన మంత్రి షింజో అబె మధ్య టెలిఫోన్లో చర్చల అనంతరం సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.