
తాజా వార్తలు
స్టీవ్‌స్మిత్ మరో మెరుపు శతకం..
టీమ్ఇండియా లక్ష్యం 390
మరోసారి చెలరేగిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్
సిడ్నీ: భీకర ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ టీమ్ఇండియాపై మరోసారి దండయాత్ర చేశారు. స్టీవ్‌స్మిత్ (104; 64 బంతుల్లో 14x4, 2x6) మెరుపు శతకంతోపాటు టాప్ ఆర్డర్ మొత్తం చెలరేగారు. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (83; 77 బంతుల్లో 7x4, 3x6), కెప్టెన్ ఆరోన్ ఫించ్ (60; 69 బంతుల్లో 6x4, 1x6) అర్ధశతకాలతో శుభారంభం చేయగా తర్వాత వచ్చిన మార్నస్ లబుషేన్ (70; 61 బంతుల్లో 5x4), మాక్స్వెల్ (63; 29 బంతుల్లో 4x4, 1x6) సైతం భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. వచ్చిన బ్యాట్స్‌మన్ వచ్చినట్లే దంచికొట్టారు. దీంతో టీమ్ఇండియాపై ఆస్ట్రేలియా మరోసారి అత్యధిక స్కోర్ సాధించింది. 50 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 389 పరుగులు చేసింది. భారత బౌలర్లలో షమి, బుమ్రా, హార్దిక్ పాండ్య తలా ఓ వికెట్ పడగొట్టినా.. పాండ్య ఒక్కడే పొదుపుగా(24/1) బౌలింగ్ చేశాడు.
ఓపెనర్లు మరోసారి..
టాస్‌గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఓపెనర్లు వార్నర్, ఫించ్ మరోసారి శతక భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ తొలి వన్డేలాగే మొదట్లో ఆచితూచి ఆడారు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే ఇద్దరూ అర్ధశతకాల తర్వాత ధాటిగా ఆడే క్రమంలో స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. తొలుత ఫించ్.. జట్టు స్కోర్ 142 పరుగుల వద్ద షమి బౌలింగ్‌లో కోహ్లీ చేతికి చిక్కాడు. మరికాసేపటికే వార్నర్ ఓ అనవసరపు పరుగుకు యత్నించి శ్రేయస్ చేతిలో రనౌటయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా 25.3 ఓవర్లకు 156/2తో నిలిచింది. ఆపై స్మిత్, లబుషేన్ మరో శతక భాగస్వామ్యం జోడించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 136 పరుగులు అందించారు. దీంతో ఆస్ట్రేలియా 40 ఓవర్లకే 275/2తో భారీ స్కోర్ సాధించింది. ఇక చివర్లో స్మిత్ శతకం బాదాక పాండ్య బౌలింగ్‌లో షమి చేతికి చిక్కి ఔటయ్యాడు. ఆపై మాక్స్వెల్ వచ్చీ రావడంతోనే విరుచుకుపడ్డాడు. వరుస బౌండరీలు, సిక్సర్లతో అలరించాడు. లబుషేన్‌తో కలిసి అతడు నాలుగో వికెట్‌కు 80 పరుగులు జోడించాడు. ఇక బుమ్రా వేసిన 48వ ఓవర్ ఐదో బంతికి పేలవ షాట్ ఆడిన లబుషేన్ మయాంక్ చేతికి చిక్కాడు. ఆఖరి ఓవర్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాక మాక్సీ రెండు సిక్సులు బాది.. టీమ్ఇండియాకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించాడు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- ప్చ్.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్!
- పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
