బుమ్రా అలా గొప్పలు చెప్పుకుంటాడు 

తాజా వార్తలు

Updated : 19/12/2020 08:55 IST

బుమ్రా అలా గొప్పలు చెప్పుకుంటాడు 

నైట్‌ వాచ్‌మెన్‌గా రావడంపై సన్నీ ఫన్నీ వ్యాఖ్యలు..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టు రెండో రోజు ఆఖర్లో టీమ్‌ఇండియా పేసర్‌ జస్ప్రీత్‌బుమ్రా నైట్‌ వాచ్‌మెన్‌గా రావడంపై మాజీ సారథి సునీల్‌ గావస్కర్‌ సరదా వ్యాఖ్యలు చేశాడు. ‘40-50 ఏళ్ల తర్వాత బుమ్రా తన మనవళ్లు, మనవరాళ్లతో మాట్లాడుతూ.. అతడు టీమ్ఇండియాకు మూడో స్థానంలో ఆడానని చెప్పుకుంటాడని, అయితే ఎలాంటి పరిస్థితుల్లో ఇలా బ్యాటింగ్‌ చేశాడనేది మాత్రం చెప్పడు’ అని గావస్కర్‌ పేర్కొన్నాడు. అడిలైడ్‌లో జరుగుతోన్న పింక్‌బాల్‌ టెస్టులో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 53 పరుగుల ఆధిక్యం సంపాదించింది.

ఈ నేపథ్యంలోనే శుక్రవారం సాయంత్రం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించగా ఓపెనర్‌ పృథ్వీషా(4) మరోసారి నిరాశపరిచాడు. జట్టు స్కోర్‌ 7 పరుగుల వద్దే కమిన్స్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. దీంతో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ నైట్‌వాచ్‌మెన్‌గా బుమ్రాను పంపించడంతో అంతా అవాక్కయ్యారు. టీమ్‌ఇండియా పేసర్‌ ఆసీస్‌ బౌలర్లను కాచుకుంటాడా అని సందేహించారు.అయితే, బుమ్రా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తెలివిగా ఆడాడు. ఆట పూర్తయ్యేవరకు ఒక్క పరుగూ చేయకుండా వికెట్‌ కాపాడుకున్నాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్‌ 9/1తో నిలిచింది. ఈ క్రమంలోనే సన్నీ అలా సరదా వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం బుమ్రా(0)కు, మయాంక్‌ అగర్వాల్‌(5) తోడుగా ఉన్నాడు. భారత్‌ 62 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మూడో రోజు నిలకడగా ఆడితే తొలి టెస్టులో భారత్‌ విజయం సాధించడం కష్టమేమీకాదు. ఇదిలా ఉండగా, బుమ్రా గతవారం జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లోనూ అర్ధశతకంతో చెలరేగాడు. అప్పుడు 54 బంతుల్లో 50 పరుగులు చేసి కంగారూ బౌలర్లను ఉతికారేశాడు. ఇప్పుడు మరోసారి వికెట్‌ కాపాడుకోవడంతో అందరి చేతా ప్రశంసలు పొందుతున్నాడు.

ఇవీ చదవండి..

ఈ రోజు నిలిస్తే..

విరుష్క.. ఆసీస్‌లో బిడ్డను కనండి!

ఇలా వదిలేస్తే కష్టమే..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని