
తాజా వార్తలు
మరో వెయ్యి పరుగుల కోసం ఎదురుచూడాలి
విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌పై సునీల్ గావస్కర్..
ఇంటర్నెట్‌డెస్క్: టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలకడైన దిగ్గజ బ్యాట్స్‌మన్ అని మాజీ సారథి సునీల్ గావస్కర్ ప్రశంసించాడు. అతడిలా మరెవరూ ఆడలేరని చెప్పాడు. బుధవారం జరిగిన మూడో వన్డేలో కోహ్లీ (63) పరుగులు చేసి హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీ చేతికి చిక్కి ఔటైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడు వన్డే ఫార్మాట్లో అరుదైన ఘనత సాధించాడు. 251 మ్యాచ్‌ల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగుల మైలురాయిని అందుకొని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ నేపథ్యంలోనే 43 శతకాలు, 60 అర్ధశతకాలు సాధించాడు. మ్యాచ్ అనంతరం ఇండియాటుడేతో మాట్లాడిన గావస్కర్.. కోహ్లీ ఆటతీరును మెచ్చుకున్నాడు.
‘అన్ని ఫార్మాట్లలో అతడి ప్రదర్శన అమోఘం. అండర్ 19 క్రికెటర్ స్థాయి నుంచి ఇప్పటిదాకా బ్యాటింగ్‌లో అతడు మెరుగైన విధానం, జట్టు కోసం ఫిట్నెస్ సాధించిన తీరు, ఆటగాడిగా తనని తాను మలుచుకున్న విధానం.. అన్నీ గొప్ప విశేషాలు. ఇవి యువ క్రికెటర్లకే కాకుండా శారీరకంగా దృఢంగా ఉండాలనుకుంటున్న ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. ఇవాళ కోహ్లీ చేరుకున్న 12 వేల మైలురాయి కన్నా అర్ధశతకం సాధించడమే గొప్ప విశేషం. 251 మ్యాచ్‌ల్లో 43 శతకాలు, 60 అర్ధ శతకాలు బాదాడంటే 100 సార్లకు పైగా మనం అతడి గురించి మాట్లాడుకున్నాం. అదంత సులువు కాదు. ఇలా ఎవరూ ఆడలేదు. అర్ధశతకాలను అతడు శతకాలుగా మలచడం నమ్మశక్యం కానిది. మనం ఈ విషయాన్ని ఆస్వాదించాలి. అతడి నుంచి మరో వెయ్యి పరుగుల కోసం ఎదురు చూడాలి. ఐదారు నెలల్లో అది చేరుకుంటాడని ఆశిస్తున్నా’ అని గావస్కర్ పేర్కొన్నాడు.
ఇవీ చదవండి
రవీంద్ర జడేజాకు హ్యాట్సాఫ్: మంజ్రేకర్
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- భారత్ చిరస్మరణీయ విజయం..
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- గుడివాడ రెండో పట్టణ ఎస్సై ఆత్మహత్య
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- భారత్ vs ఆస్ట్రేలియా: కొత్త రికార్డులు
- మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు
- ఆసీస్ పొగరుకు, గర్వానికి ఓటమిది
ఎక్కువ మంది చదివినవి (Most Read)
