సురేశ్‌ రైనా ఫిట్‌నెస్‌ మంత్ర

తాజా వార్తలు

Published : 12/11/2020 23:15 IST

సురేశ్‌ రైనా ఫిట్‌నెస్‌ మంత్ర

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా ట్విట్టర్‌ వేదికగా తన ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోను గురువారం పంచుకున్నాడు. రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు ఈ ఏడాది ఆగస్టులో రిటైర్‌మెంట్‌ ప్రకంటించిన విషయం తెలిసెందే. 33 సంవత్సరాల ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ వ్యాయామం చేస్తున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. ‘ఎప్పుడైతే మీరు మంచిగా వ్యాయామం చేస్తారో, మీ కండరాలకు గొప్ప ఉపశమనం కలుగుతుంది #థర్స్‌డే మోటివేషన్‌’అని ట్వీట్‌ చేశాడు. రైనా ఐపీఎల్‌ -2020 టోర్నీలో చెన్నై తరఫున ఆడేందుకు దుబాయి వెళ్లాడు. కానీ వ్యక్తిగత కారణాల వలన ఆకస్మికంగా తిరిగి వచ్చాడు. ఈ సీజన్‌లో లీగ్‌ దశలో చెన్నై కేవలం ఆరు మ్యాచ్‌ల్లో నెగ్గి, ఎనిమిది మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. మొత్తంగా రైనా 193 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో 137.14 స్ట్రైక్‌ రేట్‌తో 5368 పరుగులు చేశాడు. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో అతడు రెండో స్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో విరాట్‌  ఉన్నాడు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని