ర్యాప్‌తో అదరగొట్టిన రైనా

తాజా వార్తలు

Updated : 26/08/2020 13:12 IST

ర్యాప్‌తో అదరగొట్టిన రైనా

క్వారంటైన్‌లో గడుపుతున్న విధానాన్ని తెలియజేస్తూ పాట

ఇంటర్నెట్‌ డెస్క్‌: సెప్టెంబర్‌ 19 నుంచి నిర్వహించే ఐపీఎల్‌ 13వ సీజన్‌ కోసం అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. టోర్నీలో పాల్గొనే 8 జట్లు ఇప్పటికే దుబాయ్‌ చేరుకున్నాయి. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఆటగాళ్లందరు ఆరు రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా నిబంధనలు ఉన్నాయి. ఆటకు చాలా రోజులు గ్యాప్‌ రావడంతో మైదానంలోకి దిగి సహచరులతో కలిసి క్రికెట్‌ ఆడేందుకు ఆసక్తిగా ఉన్న క్రీడాకారులు.. ఆరు రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సి రావడంతో బోర్‌గా ఫీలవుతున్నారు. వర్కౌట్లు చేస్తూ, ఓటీటీల్లో సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. 

ఈమధ్యే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సురేష్‌ రైనా ఇదే విషయాన్ని పేర్కొంటూ ఓ ర్యాప్‌ సాంగ్‌తో అదరగొట్టాడు. క్వారంటైన్‌లో తన జీవితం ఎలా గడుస్తోందో తెలియజేస్తూ ర్యాప్‌ పాడి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నాడు. ‘క్వారంటైన్‌ సమయంలో ఇదే చేయాల్సి వస్తోంది.. వీడియో రికార్డు చేసి, అందరినీ అలరించడమే. మీరేమనుకుంటున్నారో చెప్పండి’ అంటూ ఆ వీడియో కింద రాసుకొచ్చాడు. క్వారంటైన్‌ సమయంలో జిమ్‌ చేస్తూ, రోజంతా నెట్‌ఫ్లిక్స్‌లో గడుపుతున్నట్లు వీడియోలో పేర్కొన్నాడు ఈ చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆటగాడు. 

క్వారంటైన్‌లో ఉన్న ఆరు రోజుల్లో ఆటగాళ్లందరికి మూడుసార్లు కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ మూడు పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చిన వారిని మాత్రమే బయో సెక్యూర్‌ విధానంలో ప్రాక్టీస్‌కి అనుమతిస్తారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని