ఎంసీజేలో కుంబ్లే సరసన బుమ్రా

తాజా వార్తలు

Published : 29/12/2020 09:57 IST

ఎంసీజేలో కుంబ్లే సరసన బుమ్రా

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టులో టీమ్‌ఇండియా పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పాడు. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానంలో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన లెజెండరీ స్పిన్నర్‌ అనిల్‌కుంబ్లే (15) సరసన చేరాడు. నాలుగో రోజు ఆటలో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా.. కమిన్స్‌(22)ను ఔట్‌ చేయడంతో ఈ ఘనత సాధించాడు. ఇంతకుముందు 2018-19 పర్యటనలో ఈ టీమ్‌ఇండియా పేసర్‌ ఇదే మైదానంలో 9 వికెట్లు తీశాడు. తాజా టెస్టులో 6 వికెట్లు పడగొట్డడంతో కుంబ్లే రికార్డును అందుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో సోమవారం స్టీవ్‌స్మిత్‌ను బౌల్డ్‌ చేసిన బుమ్రా తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. అలాగే ఇదే మైదానంలో గత పర్యటనలో అతడు 6/33 అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. బుమ్రా కన్నా ముందు భారత్‌ తరఫున ఈ మైదానంలో కుంబ్లే, కపిల్‌ దేవ్‌, చంద్రశేఖర్‌ లాంటి దిగ్గజాలు రెండేసి సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం విశేషం.

మరోవైపు టీమ్‌ఇండియా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను రెండు ఇన్నింగ్స్‌ల్లో 200 లోపే కట్టడి చేయడంలోనూ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. 133/6 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆస్ట్రేలియా మరో 67 పరుగులు జోడించి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. బుమ్రా ఈ రోజు కమిన్స్‌ను తొలి వికెట్‌గా వెనక్కి పంపాడు. ఆపై ఆస్ట్రేలియా 200 పరుగులకు ఆలౌటైంది. 

ఇవీ చదవండి..
..తప్పులు చేసేలా భారత బౌలింగ్‌
క్రికెట్లో రెండు రకాల మనుషులుంటారు: అమిత్‌ షా

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని