రైనాను అరెస్టు చేసిన ముంబయి పోలీసులు

తాజా వార్తలు

Published : 23/12/2020 01:56 IST

రైనాను అరెస్టు చేసిన ముంబయి పోలీసులు

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు సురేశ్‌ రైనాను సోమవారం రాత్రి ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. ముంబయి విమానాశ్రయం సమీపంలోని ఓ పబ్‌లో సింగర్‌ గురు రంధవతో పాటు రైనాను అరెస్టు చేశామని స్థానిక పోలీసులు వెల్లడించారు. నిబంధనలకు విరుద్దంగా పబ్‌ నిర్వహించడంతో పాటు కరోనా నియమాలు పాటించకుండా వ్యవహరించినందుకు దాడులు చేశామని, ఆ సమయంలో రైనాతో పాటు 34 మందిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. స్టేషన్‌కు తరలించాక వారిని బెయిల్‌పై విడుదల చేసినట్లు చెప్పారు. 

ఇదిలా ఉండగా, రైనా ఈ ఏడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. తన మిత్రుడు, మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించిన అరగంటలోనే ఈ లెఫ్ట్‌హ్యాండ్ బ్యాట్స్‌మన్‌ సైతం తన నిర్ణయాన్ని వెల్లడించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఆపై యూఏఈలో జరిగిన ఐపీఎల్‌ 13వ సీజన్‌లోనూ అతడు ఆడలేదు. తొలుత ఈ సీజన్‌లో ఆడేందుకు అక్కడికి వెళ్లినా తర్వాత వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడు. చెన్నై తరఫున ఆడుతున్న రైనా ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కొనసాగుతున్నాడు. బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 5,878 పరుగులతో అగ్రస్థానంలో నిలవగా.. రైనా 5,368 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.

ఇవీ చదవండి.. 
అర్ధరాత్రి మహిళలను వెంటాడిన మృత్యువు..
నవ వధువుపై భర్త పైశాచికత్వం!

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని