close

తాజా వార్తలు

టీమిండియా సమష్టి విజయం

దంచికొట్టిన కోహ్లీ, రోహిత్‌, రాహుల్‌

ముంబయి: వాంఖడే వేదికగా విండీస్‌తో జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో టీమిండియా 67 పరుగులతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌లో విజృంభించిన కోహ్లీసేన తర్వాత బౌలింగ్‌లో అదరగొట్టింది. 241 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. దీంతో భారత్‌ 2-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు టీమిండియా 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 240 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఓపెనర్లు రోహిత్‌శర్మ(71; 34 బంతుల్లో 6x4, 5x6), కేఎల్‌ రాహుల్‌(91; 56 బంతుల్లో 9x4, 4x6) శుభారంభం చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 135 పరుగులు జోడించారు. ఈ క్రమంలో రోహిత్‌ ఔటయ్యాక వన్‌డౌన్‌లో వచ్చిన రిషభ్‌ పంత్‌(0) మరోసారి విఫలమయ్యాడు. దీంతో స్వల్ప వ్యవధిలో భారత్‌ రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(70; 29 బంతుల్లో 4x4, 7x6), రాహుల్‌తో కలిసి ధాటిగా ఆడి విండీస్‌ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాడు.

అనంతరం ఛేదనకు దిగిన విండీస్‌ ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సిమన్స్‌(7), బ్రాండన్‌కింగ్‌(5), నికోలస్‌ పూరన్‌(0) విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో క్రీజులోకి వచ్చిన హెట్మెయిర్‌(41; 24 బంతుల్లో 1x4, 5x6), పొలార్డ్‌(68; 39 బంతుల్లో 5x4, 6x6) భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరూ పోరాడినా కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడంతో టీమిండియా మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఈ క్రమంలో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. కోహ్లీసేన 67 పరుగులతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లలో దీపక్‌ చాహర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌ తలో రెండు వికెట్లు తీశారు. కేఎల్‌ రాహుల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికవ్వగా, విరాట్‌ కోహ్లీ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.