IPL 2021: నటరాజన్‌కి కరోనా... ఐసోలేషన్‌లో ఆరుగురు.. మరి మ్యాచ్‌?

తాజా వార్తలు

Updated : 22/09/2021 15:50 IST

IPL 2021: నటరాజన్‌కి కరోనా... ఐసోలేషన్‌లో ఆరుగురు.. మరి మ్యాచ్‌?

దుబాయ్‌ : ఐపీఎల్‌ రెండో దశలోనూ కరోనా కలకలం మొదలైంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఆటగాడు నటరాజన్‌కు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతడితో సన్నిహితంగా మెలిగిన ఆరుగురుని ఐసోలేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. వారిలో ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌, మేనేజర్‌ విజయ్‌ కుమార్‌, ఫిజియోథెరపిస్ట్‌ శ్యామ్‌ సుందర్‌, డాక్టర్‌ అంజనా వన్నన్‌, లాజిస్టిక్‌ మేనేజర్‌ తుషార్‌ ఖేడ్కర్‌, నెట్‌ బౌలర్‌ పెరియసామి గణేశన్‌ ఉన్నారు.

జట్టులోని మిగిలిన ఆటగాళ్లు, ఇతర సిబ్బందికి ఈ రోజు ఉదయం ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు. వాటిలో అందరికీ నెగిటివ్‌ వచ్చిందట. దీంతో ఇవాళ్టి మ్యాచ్‌ (సన్‌రైజర్‌ vs దిల్లీ కేపిటల్స్‌) యథావిధిగా కొనసాగుతుందని ఐపీఎల్‌ వర్గాలు తెలిపాయి. కరోనా కేసుల నేపథ్యంలో ఐపీఎల్‌ 2021 సీజన్‌ను తొలి 30 మ్యాచ్‌ల తర్వాత నిలిపేసిన విషయం తెలిసిందే. ఇప్పడు రెండో దశలోనూ కరోనా కేసుల బయటపడటం కాస్త ఆందోళన కలిగిస్తోంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని