Tokyo Olympics: అబ్బాయిలూ.. చీర్స్!  భారత్ పండుగ మూడ్‌లో ఉంది..!

తాజా వార్తలు

Updated : 05/08/2021 10:38 IST

Tokyo Olympics: అబ్బాయిలూ.. చీర్స్!  భారత్ పండుగ మూడ్‌లో ఉంది..!

పురుషుల హాకీ జట్టుపై అభినందనల వెల్లువ

దిల్లీ: భారత పురుషుల హాకీ జట్టు దేశ ప్రజలకు మంచి కబురు వినిపించింది. 41 ఏళ్ల ఎదురుచూపులకు తెరదించుతూ టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించి ఈ రోజును ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసింది. గురువారం జరిగిన కాంస్య పోరులో బలమైన ప్రత్యర్థి జర్మనీని 5-4 తేడాతో ఓడించి పతకాన్ని ముద్దాడింది. దీంతో హాకీ ఇండియాపై ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

41 సంవత్సరాల విరామానికి ముగింపు పలుకుతూ ఒలింపిక్‌ పతకం సాధించిన పురుషుల హాకీ జట్టుకు అభినందనలు. ఈ జట్టు గొప్ప నైపుణ్యం, సంకల్పాన్ని ప్రదర్శించింది. ఈ విజయం భారత హాకీలో కొత్త శకానికి నాంది పలకనుంది. క్రీడల పట్ల యువతకు ప్రేరణగా నిలుస్తుంది. - రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌

జర్మనీతో జరిగిన పోరులో విజయం సాధించి, కాంస్య పతకాన్ని ముద్దాడిన భారత హకీ జట్టుకు హృదయపూర్వక అభినందనలు. జట్టు అద్భుత నైపుణ్యాలతో విజయాన్ని సొంతం చేసుకుంది. మీ పట్ల ఈ దేశం గర్విస్తోంది. - ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

చరిత్ర సృష్టించారు! ఈ రోజు ప్రతి భారతీయుడి మదిలో నిలిచిపోయే రోజు. కాంస్య పతకాన్ని సాధించిన పురుషుల హాకీ బృందానికి అభినందనలు. ఈ విజయంతో వారు ఈ దేశ ప్రజలు, మరీ ముఖ్యంగా యువత ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించారు. మీ పట్ల ఈ దేశం గర్వపడుతోంది. - ప్రధాని నరేంద్ర మోదీ

అబ్బాయిలు..చీర్స్‌! మీరు సాధించారు. మేం ఇక నిశ్శబ్దంగా ఉండలేం. ఈ రోజు భారత హాకీ జట్టు ఒలింపిక్‌ చరిత్రలో తమ ఆటతీరుకు సరికొత్త నిర్వచనం ఇచ్చింది. మీ పట్ల చాలా గర్వంగా ఉంది. - కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్

41 ఏళ్ల ఎదురుచూపుల తర్వాత భారత హాకీ, ఈ దేశ క్రీడలకు ఇదొక సువర్ణ క్షణం. జర్మనీని ఓడించి కాంస్య పతకాన్ని గెల్చుకోవడంతో సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు లభించింది. భారత్ ఇప్పుడు సంబరాలు చేసుకునే మూడ్‌లో ఉంది. మా హాకీ క్రీడాకారులకు అభినందనలు. - కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని