Shivam Dube: ఓ ఇంటివాడైన శివమ్‌ దుబే

తాజా వార్తలు

Updated : 17/07/2021 11:07 IST

Shivam Dube: ఓ ఇంటివాడైన శివమ్‌ దుబే

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమిండియాలో మరో క్రికెటర్‌ ఓ ఇంటివాడయ్యాడు. భారత ఆల్‌రౌండర్‌ శివమ్‌ దుబే పెళ్లి చేసుకున్నాడు. ప్రేయసి అంజుమ్‌ ఖాన్‌తో దుబే వివాహం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ విషయాన్ని అతడు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాడు. ‘‘ప్రేమ కంటే ఎక్కువ ప్రేమతో మేం ప్రేమించుకున్నాం. మా చిరకాల ప్రయాణానికి ఇదే నాంది’’ అని దుబే రాసుకొచ్చాడు.

వివాహబంధంలోకి అడుగుపెట్టిన దుబేకు శ్రేయస్‌ అయ్యర్‌ సహా పలువురు క్రికెటర్లు సోషల్‌మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. అటు రాజస్థాన్‌ రాయల్స్‌ కూడా ‘బదాయి హో’ అంటూ అభినందనలు తెలియజేసింది.

28ఏళ్ల దుబే 2019లో టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. టీమిండియా తరఫున 13 టీ20లు ఆడి ఒక అర్ధశతకం కూడా నమోదు చేశాడు. ఐపీఎల్‌లో అంతకుముందు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఆడిన దుబేను ఈ ఏడాది రాజస్థాన్‌ రాయల్స్‌ సొంతం చేసుకుంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని