Virat Kohli: కోహ్లి.. రోహిత్‌ను తప్పించాలనుకున్నాడా?

తాజా వార్తలు

Updated : 18/09/2021 09:36 IST

Virat Kohli: కోహ్లి.. రోహిత్‌ను తప్పించాలనుకున్నాడా?

దిల్లీ: టీ20 ప్రపంచకప్‌ తర్వాత పొట్టి క్రికెట్‌ పగ్గాలు వదిలేయబోతున్నట్లు విరాట్‌ కోహ్లి చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ సమయంలో అతను ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడనే చర్చ మొదలైంది. అందులో భాగంగానే ఇప్పుడు మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. కోహ్లి, పరిమిత ఓవర్ల వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ మధ్య గతంలో విభేధాలున్నాయనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అంతా సర్దుకున్నట్లు కనిపించింది. నాయకత్వ బృందంలో రోహిత్‌ కూడా ఉన్నాడని కోహ్లి తన తాజా ప్రకటనలో పేర్కొన్నాడు. కానీ వీళ్ల మధ్య ఆ విభేధాలు సమసిపోలేదని, వన్డేల్లో వైస్‌ కెప్టెన్‌గా రోహిత్‌ను తొలగించాలని కోహ్లి కోరినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినప్పటికీ ఈ ప్రచారం మాత్రం జోరందుకుంది.

‘‘34 ఏళ్ల రోహిత్‌ను వైస్‌ కెప్టెన్‌ బాధ్యతల నుంచి తొలగించి.. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా ఆ స్థానాన్ని కేఎల్‌ రాహుల్‌కు ఇవ్వాలని సెలక్షన్‌ కమిటీ ముందు కోహ్లి ప్రతిపాదించాడు. అలాగే టీ20ల్లో పంత్‌ను వైస్‌ కెప్టెన్‌ చేయాలని కోరాడు. కానీ బోర్డు అందుకు ఒప్పుకోలేదు. కోహ్లి అసలైన వారసుడిని కోరుకోవడం లేదని బోర్డు భావించింది. వచ్చే టీ20 ప్రపంచకప్‌లో జట్టు రాణించకపోతే తనను పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టు కెప్టెన్సీ నుంచి తొలగిస్తారని కోహ్లీకి తెలుసు. అందుకే టీ20 కెప్టెన్సీ వదులుకుంటానని ప్రకటించాడు’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఇప్పుడు రోహిత్‌ టీ20 పగ్గాలు చేపట్టి మంచి ప్రదర్శన చేస్తే.. వచ్చే 2023 వన్డే ప్రపంచకప్‌ సమయానికి కోహ్లిని సారథిగా తప్పించి రోహిత్‌కు ఆ బాధ్యతలూ అప్పజెప్పే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని