వెయ్యి సార్లు గెలిచాడు..

తాజా వార్తలు

Published : 05/11/2020 14:41 IST

వెయ్యి సార్లు గెలిచాడు..

ఇదో గొప్ప విజయం: రఫెల్‌ నాదల్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన కెరీర్లో గొప్ప విజయాన్ని సాధించినట్టు టెన్నిస్‌ దిగ్గజం రఫెల్‌ నాదల్‌ ప్రకటించాడు. టూర్‌ లెవెల్‌ టెన్నిస్‌లో వెయ్యవ విజయాన్ని స్వంతం చేసుకున్న 34 ఏళ్ల రఫా.. ఈ ఘనతను సాధించిన నాలుగవ వ్యక్తిగా నిలిచాడు. బుధవారం జరిగిన పారిస్‌ మాస్టర్స్‌ పోటీ రెండవ రౌండులో ఫెలిసియానో లోపెజ్‌పై సాధించిన విజయంతో నాదల్‌ వెయ్యి సార్లు గెలిచినట్లయింది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని నాదల్‌కు ఓ ప్రత్యేక జ్ఞాపికను బహూకరించారు. ఇప్పటికే 1000 విజయాల మార్కును సాధించిన వారిలో జిమ్మీ కోనర్స్, రోజర్‌ ఫెదరర్‌, ఇవాన్‌ లెండీ ఉన్నారు.

గాయాల రూపంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా.. పలు విషయాల పట్ల గర్వపడుతున్నానని 20 సార్లు గ్రాండ్‌స్లామ్‌ను గెలిచిన  రఫెల్‌ ఈ సందర్భంగా వెల్లడించాడు. ఊహించని రీతిలో ఇబ్బంది పెట్టే సంఘటనలు తన కెరీర్లో తారసపడినా.. ముందుకు సాగాలనే సంకల్పంతోనే కొనసాగినట్టు ఆయన వివరించాడు. ఏప్రిల్‌ 2002లో తొలి గెలుపును నమోదు చేసేప్పటికి నాదల్‌ వయస్సు పదిహేనేళ్లు. కాగా ఈ గెలుపు తనకో అద్భుత విజయమని టెన్నిస్‌లో ప్రపంచ నెంబర్‌ 2 ఆటగాడైన రఫెల్‌ నాదల్‌ తెలిపాడు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని