నీతో కలిసి పనిచేయడమే నాకో గౌరవం
close

తాజా వార్తలు

Published : 17/08/2020 22:03 IST

నీతో కలిసి పనిచేయడమే నాకో గౌరవం

మహీని ప్రశంసించిన మాజీ కోచ్‌ గ్యారీ కిర్‌స్టన్‌

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ఎంఎస్‌ ధోనీతో కలిసి పనిచేయడం అత్యుత్తమ గౌరవంగా భావిస్తున్నానని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ గ్యారీ కిర్‌స్టన్‌ అన్నారు. జట్టుతో కలిసి ఎన్నో మధురస్మృతులు అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంలోని మేటి సారథుల్లో మహీ ఒకరిని ప్రశంసించారు.

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌ తర్వాత జట్టుకు దూరమైన ఎంఎస్‌ ధోనీ శనివారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. టెస్టులకు వీడ్కోలు పలికినప్పటి నుంచే అతడు దేశవాళీ క్రికెట్‌ ఆడటం లేదు. ఇకపై కేవలం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లోనే అభిమానులను అలరించనున్నాడు. కరోనా వైరస్‌ ముప్పుతో మార్చిలో జరగాల్సిన ఐపీఎల్‌-2020 సెప్టెంబర్‌ 19న మొదలవుతోంది. అయితే పొట్టి క్రికెట్‌ వేడుకకు యూఏఈ ఆతిథ్యమిస్తోంది. ఇప్పటికే చెపాక్‌కు చేరుకున్న మహీ జట్టు సభ్యులతో కలిసి ఆగస్టు 20 తర్వాత ప్రత్యేక విమానంలో దుబాయ్‌ చేరుకోనున్నాడు. వీడ్కోలు తర్వాత అతడెలా ఆడతాడో అన్న ఆసక్తి నెలకొంది.

‘ప్రపంచంలోనే అత్యుత్తమ సారథుల్లో ఒకరైన ధోనీతో కలిసి పనిచేయడం నాకు దక్కిన గౌరవం. టీమ్‌ఇండియాతో కలిసి నాకు మధుర స్మృతులు అందించిన మహీకి కృతజ్ఞతలు’ అని కిర్‌స్టన్‌ ట్వీట్‌ చేశాడు. మూడు చిత్రాలను పోస్ట్‌ చేశాడు. అందులో ఒకచిత్రంపై ‘ఎంఎస్‌ ధోనీతో కలిసి యుద్ధానికైనా వెళ్తాను’ అని రాసుండటం గమనార్హం. మహీ, కిర్‌స్టన్‌ కలయికలో భారత జట్టు అద్భుత విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. 2010లో ఆసియా కప్‌ గెలించింది. 2011లో భారతీయులు ఏళ్లుగా ఎదురు చూస్తున్న రెండో ప్రపంచకప్‌ కల నెరవేరింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని