రెండో టెస్టులో భారత్‌ అంత తేలిగ్గా తలొగ్గదు

తాజా వార్తలు

Published : 26/12/2020 00:07 IST

రెండో టెస్టులో భారత్‌ అంత తేలిగ్గా తలొగ్గదు

 

ఇంటర్నెట్‌డెస్క్‌: అడిలైడ్‌లో చేతులెత్తేసినట్లు టీమ్‌ఇండియా మెల్‌బోర్న్‌లో తలవంచదని ఆస్ట్రేలియా కెప్టెన్‌ టిమ్‌పైన్‌ అన్నాడు. క్రికెట్‌ను ప్రతిష్ఠాత్మకంగా భావించే భారత్‌ రెండో టెస్టులో అంత తేలిగ్గా లొంగదని చెప్పాడు. తొలి టెస్టులో భారత్‌ ఘోర పరాభవం పాలైన నేపథ్యంలో శనివారం నుంచి ప్రారంభమయ్యే తర్వాతి మ్యాచ్‌లో ఐదు మార్పులతో దిగనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌లాంటి ఆటగాళ్లతో ప్రమాదం పొంచి ఉందని టిమ్‌పైన్‌ పేర్కొన్నాడు.

టీమ్‌ఇండియా క్రికెట్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుందని, టెస్టుల్లో అది అత్యంత ప్రమాదకరమైన జట్టని చెప్పాడు. దీంతో రెండో టెస్టులో ఏ మాత్రం అవకాశమివ్వమని అన్నాడు. గతేడాది ఇంగ్లాండ్‌తో తలపడిన యాషెస్‌ టోర్నీలో 2-1 ఆధిక్యంలో నిలిచినా చివరి టెస్టులో అది విజయం సాధించి సిరీస్‌ను సమం చేసిందని, ఈ నేపథ్యంలోనే భారత్‌కు ఏ చిన్న అవకాశం ఇచ్చినా అది దూసుకెళుతుందని పైన్‌ వివరించాడు. అడిలైడ్‌లో ఆడినట్లే మెల్‌బోర్న్‌లో ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నామని ఆసీస్‌ కెప్టెన్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

బాక్సింగ్‌డే టెస్టులో తాము విజయం సాధిస్తే మూడు, నాలుగు టెస్టులు భారత్‌కు ఇంకా కష్టమవుతాయని పైన్‌ పేర్కొన్నాడు. అంతకన్నా ముందు రెండో టెస్టులో శుభారంభం చేయాల్సిన అవసరం ఉందన్నాడు. 

ఇవీ చదవండి..

ఇదేం అంపైరింగో.. బంతి బ్యాట్‌కు‌ తాకినా..
జడ్డూకు ఫిట్‌నెస్‌ టెస్ట్‌: జట్టుకు సరికొత్త సాధన
కోహ్లీలా దూకుడు కాదనుకోవద్దు సుమా!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని