విరాట్‌ కోహ్లీ నచ్చడు కానీ..

తాజా వార్తలు

Updated : 14/11/2020 09:42 IST

విరాట్‌ కోహ్లీ నచ్చడు కానీ..

అతడి బ్యాటింగ్‌ అంటే ఇష్టం: టిమ్‌పైన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఎంత గొప్ప ఆటగాడో అందరికీ తెలిసిందే. అతడు ఆడుతుంటే ఇష్టపడని క్రికెట్‌ అభిమానులు ఉండరు. తన బ్యాటింగ్‌ నైపుణ్యంతో పరుగుల వేటలో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ తర్వాత అంత గొప్ప పేరు సాధించిన ఆటగాడు అతడు‌. అలాంటి గొప్ప బ్యాట్స్‌మన్‌ను తాము ఇష్టపడమని, కానీ ఒక క్రికెట్‌ అభిమానిగా కోహ్లీ బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తామని ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్‌ టిమ్‌పైన్‌ అన్నాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.

‘కోహ్లీ గురించి నన్ను చాలా మంది అడుగుతుంటారు. అయితే, నా దృష్టిలో అందరిలాగే అతడూ ఒక ఆటగాడు మాత్రమే. తన విషయంలో నేనేం కంగారు పడను. నిజం చెప్పాలంటే కోహ్లీతో మాకు అంత బలమైన బంధం లేదు. టాస్‌ వేసేటప్పుడు మాత్రమే అతడిని చూస్తాను. తర్వాత కలిసి ఆడతాం. అంతకుమించి ఇంకేం ఉండదు. అతడిని మేం ఇష్టపడం కానీ, ఒక క్రికెట్‌ అభిమానిగా మాత్రం అతడు ఆడుతుంటే చూడాలనుకుంటాం. అతడి బ్యాటింగ్‌ను ఆస్వాదించినా ఎక్కువ పరుగులు సాధించడం నచ్చదు. మా రెండు జట్ల మధ్య హోరాహోరీ పోటీ ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అలాగే ఈ సిరీస్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని ఆస్ట్రేలియా కెప్టెన్‌ పేర్కొన్నాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని