close

తాజా వార్తలు

కివీస్‌ గడ్డ.. ఎవరికయ్యేను పరుగుల అడ్డా!

భారత్‌, న్యూజిలాండ్‌లో అత్యధిక పరుగుల వీరులు వీరే 

కొత్త ఏడాదిని టీమిండియా ఘనంగా ఆరంభించింది. సమవుజ్జీతో జరిగిన పోరులో 0-1తో వెనకబడి సందేహాలు రేకెత్తించింది. ఆపై రాజ్‌కోట్‌లో పుంజుకొని ఆసీస్‌పై వరుసగా రెండు వన్డేలు గెలిచింది. సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకొని ఆత్మవిశ్వాసంతో న్యూజిలాండ్‌ గడ్డపై అడుగుపెట్టింది. ఈ రెండు జట్లు గతంలో 12 టీ20ల్లో తలపడగా 8-3తో కివీస్‌దే పైచేయి. పరుగుల వీరుల జాబితాలోనూ వారే ముందున్నారు. మరికొద్ది రోజుల్లో టీ20 సిరీసులో తలపడుతున్న సందర్భంగా వారి మెరుపు ఇన్నింగ్స్‌లు మీకోసం...!

 


ఒకే ఒక్కడు.. కొలిన్‌ మన్రో

భారత్‌ X న్యూజిలాండ్‌ మధ్య ఇప్పటి వరకు 12 అంతర్జాతీయ టీ20లు జరిగాయి. అయితే, రెండు జట్లలో ఒకే ఒక్క బ్యాట్స్‌మన్‌ పొట్టి ఫార్మాట్‌లో శతకం బాదాడు. 2017 నవంబర్‌ 4న రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన పోరులో కొలిన్‌ మన్రో (109; 58 బంతుల్లో, 7x4, 7x6) మూడంకెల స్కోరుతో కదం తొక్కాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అనంతరం భారత్‌ ఏడు వికెట్లు నష్టపోయి 156 పరుగులకే పరిమితమైంది. దీంతో పర్యాటక జట్టు 40 పరుగుల తేడాతో విజయం సాధించింది.


మెక్‌కలమ్‌ మెరిసే.. కివీస్‌ మురిసే

చెన్నై వేదికగా 2012లో జరిగిన తొలి టీ20లో కివీస్‌ బ్యాట్స్‌మన్‌ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ ‌(91; 55 బంతుల్లో, 11x4, 3x6) అద్భుతంగా ఆడాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ ఐదు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. అనంతరం విరాట్‌ కోహ్లీ (70; 41 బంతుల్లో 10x4, 1x6) ధాటిగా ఆడినా అతడికి సహకరించే బ్యాట్స్‌మెన్‌ కరవయ్యారు. దీంతో భారత్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలవ్వడం గమనార్హం.


టిమ్‌ సీఫెర్ట్‌ శుభారంభం

2019 భారత్‌.. న్యూజిలాండ్‌ పర్యటన సందర్భంగా జరిగిన తొలి టీ20లో ఆతిథ్య జట్టు మరోసారి చెలరేగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 219/6 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్‌ టిమ్‌ సీఫెర్ట్ ‌(84; 43 బంతుల్లో 7x4, 6x6) మెరుపు బ్యాటింగ్‌ చేయడంతో కివీస్‌ కోహ్లీసేన ముందు పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించింది. తర్వాత టీమిండియా 139 పరుగులకే ఆలౌటై 80 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది.


దంచికొట్టిన రోహిత్‌, ధావన్‌

2017లో న్యూజిలాండ్‌ భారత పర్యటన సందర్భంగా దిల్లీలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత ఓపెనర్లు చెలరేగారు. రోహిత్‌ శర్మ (80; 55 బంతుల్లో 6x4, 4x6), శిఖర్‌ ధావన్ ‌(80; 52 బంతుల్లో 10x4, 2x6) ధాటిగా ఆడి తొలి వికెట్‌కు 158 పరుగులు జోడించారు. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా 202 పరుగులు చేసింది. అనంతరం న్యూజిలాండ్‌ లక్ష్య ఛేదనలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 149 పరుగులతో సరిపెట్టుకుంది. దీంతో భారత్‌ 53 పరుగుల తేడాతో విజయం సాధించింది.

-ఇంటర్నెట్‌ డెస్క్‌, ప్రత్యేకం


 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.