ఇదేం అంపైరింగో.. బంతి బ్యాట్‌కు‌ తాకినా..

తాజా వార్తలు

Updated : 25/12/2020 10:24 IST

ఇదేం అంపైరింగో.. బంతి బ్యాట్‌కు‌ తాకినా..

బీబీఎల్‌లో అంపైర్ల తప్పుడు నిర్ణయాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే బిగ్‌బాష్‌ లీగ్‌లో అంపైర్ల తప్పిదాలు ఆటగాళ్లకు, క్రికెట్‌ అభిమానులకు విసుగు పుట్టిస్తున్నాయి. మరీ ఇంత దారుణంగా తప్పుడు నిర్ణయాలా? అంటూ పలువురు మండిపడుతున్నారు. అంపైరింగ్‌ చేయడం కష్టతరమే అయినా, కళ్లకు కట్టినట్లు కనిపించే వాటిని కూడా తప్పుగా ప్రకటించడం ఆయా క్రికెటర్లను విస్మయానికి గురి చేస్తున్నాయి. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రెండు భారీ తప్పిదాలు చోటుచేసుకోవడం ఆస్ట్రేలియా క్రికెట్‌ అభిమానులకు సైతం మింగుడుపడడంలేదు.

బుధవారం అడిలైడ్‌ స్ట్రైకర్స్‌తో తలపడిన మ్యాచ్‌లో బ్రిస్బేన్‌ బ్యాట్స్‌మన్‌ టామ్‌ కూపర్‌(22) ఆడిన ఓ బంతిని అంపైర్‌ టోనీ వైల్డ్స్‌ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. బంతి బ్యాట్‌కు తాకి ప్యాడ్లకు తాకినా అతడు ఔటివ్వడం వివాదాస్పదంగా మారింది. డానీబ్రిగ్స్‌ వేసిన 11.2 బంతిని టామ్‌ కూపర్‌ రివర్స్‌స్వీప్‌ ఆడే ప్రయత్నం చేశాడు. ఆ బంతి బ్యాట్‌కు తగిలి ఆ తర్వాత ప్యాడ్‌కు తగిలింది. బౌలర్‌ అప్పీల్‌ చేయడంతో అంపైర్‌ ఔటిచ్చాడు. రీప్లేలో ఆ బంతి బ్యాట్‌కు తాకినట్లు చాలా స్పష్టంగా కనిపించింది.

ఇక అంతకుముందు రోజు కూడా ఇలాంటి అంపైరింగ్‌ తప్పిదమే జరిగింది. పెర్త్‌ స్కార్చర్స్‌తో తలపడిన మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్‌ బ్యాట్స్‌మన్‌ ఉస్మాన్‌ ఖవాజా(21) ఆడిన ఓ బంతి నేరుగా వెళ్లి కీపర్‌ చేతుల్లో పడింది. బంతి బ్యాట్‌కు తాకిన శబ్దం కూడా చాలా స్పష్టంగా వినిపించింది. ఆండ్రూ టై వేసిన ఆ బంతి ఖవాజా బ్యాట్‌ను తాకుతూ కీపర్‌ చేతుల్లోకి వెళ్లినట్లు రీప్లేలోనూ కనిపించింది. అయితే అంపైర్‌ సైమన్‌ లైట్‌బాడీ దాన్ని నాటౌట్‌గా పేర్కొని అందర్నీ విస్మయానికి గురి చేశాడు. ఈ రెండు తప్పులపైన ఆస్ట్రేలియా క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. అలాగే స్పిన్‌ దిగ్గజం షేన్‌వార్న్‌ సైతం వీటిపై అసహనం వ్యక్తం చేశాడు. ఈ టోర్నీ మెరుగ్గా నిర్వహించాలంటే డీఆర్‌ఎస్‌ అమలు చేయాలని క్రికెట్‌ ఆస్ట్రేలియాకు సూచించాడు.

ఇవీ చదవండి.. 
10 జట్లతో 2022 ఐపీఎల్‌
దుమారం రేపిన సన్నీ!
కోహ్లీలా దూకుడు కాదనుకోవద్దు సుమా!
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని