close

తాజా వార్తలు

అండర్‌ 19 ప్రపంచకప్‌: చితక్కొట్టిన భారత్‌

మన్‌గావుంగ్‌ ఓవల్‌: అండర్‌ 19 ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో యువ భారత్‌ దంచి కొట్టింది. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న శ్రీలంక భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. యశస్వి జైస్వాల్‌(59; 74 బంతుల్లో 8x4), దివ్యాన్ష్‌ సక్సేనా(23; 27 బంతుల్లో 3x4) శుభారంభం చేశారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ 66 పరుగులు జోడించారు. దివ్యాన్ష్‌ ఔటైన తర్వాత తిలక్‌ వర్మ(46; 53 బంతుల్లో 3X4)తో కలిసి యశస్వి మరో విలువైన భాగస్వామ్యం జోడించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 66 పరుగులు జోడించారు. యశస్వి ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ ప్రియమ్‌ గార్గ్‌(56; 72 బంతుల్లో 2x4) బాధ్యతాయుతంగా ఆడాడు. తిలక్‌, ప్రియమ్‌ మూడో వికెట్‌ 59 పరుగులు జోడించారు. వీరిద్దరు ఔటయ్యాక ధ్రవ్‌జరేల్‌(52; 48  బంతుల్లో 3x4, 1x6), సిద్దేశ్‌ వీర్‌ (44; 27 బంతుల్లో 6x4, 1x6) ధాటిగా ఆడి భారత్‌ స్కోరును 297 పరుగులకు తీసుకెళ్లారు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.