close
Array ( ) 1

తాజా వార్తలు

నాలో కసి ఇంకా అలానే ఉంది: ఉతప్ప

దిల్లీ: ప్రస్తుతం టీమ్‌ఇండియాకు మంచి ఫినిషర్‌ అవసరమని, ఆ స్థానాన్ని భర్తీ చేసి ప్రపంచకప్‌కు మరోసారి ప్రాతినిధ్యం వహిస్తానని భారత సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రాబిన్‌ ఉతప్ప ఆశాభావం వ్యక్తం చేశాడు. 34 ఏళ్ల ఉతప్ప టీమ్‌ఇండియా తరఫున చివరిగా 2015లో జింబాబ్వేతో టీ20 ఆడాడు. 2011 నుంచి కేవలం 8 వన్డేలు, నాలుగు టీ20లు మాత్రమే ఆడాడు. 2007 వన్డే ప్రపంచకప్‌తో పాటు అదే ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌ జట్టులోనూ ఉన్నాడు. అయితే ఓపెనర్‌గానే కాకుండా మిడిలార్డర్‌లోనూ సత్తా చాటగలనని ఉతప్ప అంటున్నాడు.

‘‘నాలో కసి ఇంకా అలానే ఉంది. తప్పకుండా సత్తా చాటగలను. పొట్టి ఫార్మాట్‌లో భారత్‌ తరఫున ప్రపంచకప్‌కు మరోసారి ప్రాతినిధ్యం వహిస్తానన్న నమ్మకం ఉంది. అయితే దానికి అదృష్టం, దేవుడి ఆశీర్వాదం కూడా ఉండాలి. భారత్‌లో ఇది ఎంతో ముఖ్యం. ఇతర దేశాల్లో అయితే పెద్దగా అవసరం లేదు. అంతేకాక మనపై మనం విశ్వాసం ఉంచుకోవాలి. సానుకూల ధోరణితో ఉండాలి. సామర్థ్యం ఉందని భావించాలి’’ అని ఉతప్ప తెలిపాడు.

‘‘టీమ్‌ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహిస్తానని విశ్వసిస్తున్నా. విశ్వవిజేతగా నిలిచే జట్టులో నేను భాగం కావొచ్చు. కప్‌ను గెలవడంలో కీలక పాత్ర పోషించవచ్చు. నా కలలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. అప్పటివరకు క్రికెట్ ఆడతాను. రోజు రోజుకి నా ఆట మెరుగుపరుచుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాను. నేను ఓపెనర్‌గా రాణించగలను.అంతేకాక మిడిలార్డర్‌లోనూ సత్తాచాటగలను. ప్రస్తుతం భారత క్రికెట్‌ మంచి ఫినిషర్‌ కోసం ఎదురుచూస్తుంది. దీనిపై తీవ్ర సాధన చేస్తున్నాను’’ అని పేర్కొన్నాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.