close

తాజా వార్తలు

Updated : 01/10/2020 15:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇదేం పనప్పా.. ఉతప్ప!

బంతికి ఉమ్మి రాస్తూ దొరికిపోయిన వైనం

దుబాయ్‌: కరోనా వైరస్‌ ముప్పుతో బంతిపై మెరుపు కోసం ఉమ్మిని రుద్దకూడదని ఐసీసీ తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే శిక్షలు ఏంటో చెప్పింది. అలవాటులో పొరపాటో.. ఉద్దేశపూర్వకంగా చేశాడో తెలియదు గానీ బంతికి లాలాజలం రాస్తూ కెమెరాకు చిక్కాడు రాబిన్‌ ఉతప్ప.

దుబాయ్‌ వేదికగా గురువారం రాత్రి రాజస్థాన్‌, కోల్‌కతా తలపడ్డాయి. టాస్‌ గెలిచిన స్టీవ్‌స్మిత్‌ తొలుత దినేశ్‌ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. శుభ్‌మన్‌ గిల్‌ (47), నితీశ్‌ రాణా (22), రసెల్‌ (24), మోర్గాన్‌ (34*)  రాణించడంతో 6 వికెట్లు నష్టపోయి 174 పరుగులు చేసింది. ఛేదనలో రాజస్థాన్‌ తేలిపోయింది. 42 పరుగులకే 5 వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడింది. స్మిత్‌, సంజు, తెవాతియా, ఉతప్ప, రియాన్‌ విఫలమయ్యారు. టామ్‌ కరణ్‌ (54*) అర్ధశతకం బాదడమే ఆ జట్టుకు ఊరట. మిగతా ఆటగాళ్లు పరుగులు చేయకపోవడంతో రాజస్థాన్‌ 137/9కే పరిమితమైంది.

కోల్‌కతా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో రాజస్థాన్‌ ఫీల్డర్‌ రాబిన్‌ ఉతప్ప బంతికి ఉమ్మిని రుద్దాడు. మూడో ఓవర్‌ ఐదో బంతికి నరైన్‌ క్యాచ్‌ను అతడు నేలపాలు చేశాడు. ఆ తర్వాత బంతికి లాలాజలం రుద్దుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌  మీడియాలో చక్కర్లు కొడుతోంది.

బంతికి ఫీల్డర్‌ ఉమ్మి రుద్దితే అంపైర్లు కలగజేసుకొంటారు. బంతిని శుభ్రం చేయిస్తారు. మొదటి సారి ఫీల్డర్‌కు నిబంధనలను వివరిస్తారు. వరుసగా రెండుసార్లు చేస్తే హెచ్చరిస్తారు. ఆ తర్వాతా అలాగే చేస్తే శిక్షగా ప్రత్యర్థికి ఐదు పరుగులు అదనంగా ఇస్తారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.