close
Array ( ) 1

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో క్రీడావసతులపై వెంకయ్య ఆరా

దిల్లీ: క్రీడాశాఖ మంత్రి, అధికారులతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన నివాసంలో సమీక్షించారు. తెలుగు రాష్ట్రాల్లో క్రీడల ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్‌ రిజిజుకు సూచించారు. క్రీడా రంగం అభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలను అభినందించిన ఉపరాష్ట్రపతి.. క్రీడాభివృద్ధిలో ప్రైవేటు రంగాన్నీ భాగస్వాముల్ని చేయాలన్నారు. కళాశాలలు, వర్సిటీలు క్రీడలను ప్రోత్సహించాలని తెలిపారు. దీనికోసం ప్రత్యేక కార్యాచరణ తయారు చేసుకోవాలని సూచించారు.

యూసీల రాకలో ఆలస్యం: ఉపరాష్ట్రపతితో రిజిజు

నెల్లూరు జిల్లా మొగళ్లపాలెం ఇండోర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌తో పాటు విజయనగరం విజ్జీ స్టేడియంలో ఇండోర్‌ హాల్‌, విశాఖ కొమ్మాదిలోని మినీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో సింథటిక్‌ అథ్లెటిక్‌ ట్రాక్‌పై వెంకయ్యనాయుడు ఆరా తీశారు. కాకినాడ క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో ఆస్ట్రో టర్ఫ్‌ హాకీ ఫీల్డ్‌ ఏర్పాటుపై మాట్లాడారు. ఇండోర్‌ స్టేడియాలు, ఇతర ప్రాజెక్టులపై నిదులు విడుదల చేశామనీ.. యూసీల రాకలో ఆలస్యమవుతోందని రిజిజు ఉప రాష్ట్రపతికి తెలిపారు. దీంతో యూసీలు వచ్చాక త్వరగా మిగతా పనులు పూర్తి చేయాలని సూచించారు. సమావేశం మధ్యలో ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్‌తోనూ వెంకయ్య చర్చించారు. హైదరాబాద్‌ గచ్చిబౌలి స్టేడియంలో క్రీడా వసతులపై ఆరా తీశారు. గచ్చిబౌలిలో వసతులన్నీ బాగున్నాయని సంతృప్తి వ్యక్తంచేసిన ఆయన.. అక్కడ జాతీయ స్థాయి పోటీలు నిర్వహించాలని సూచించారు. 

ఈ నెల 23న వరంగల్‌ పర్యటన

ఈ నెల 23న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఏవీవీ పాఠశాల ప్లాటినమ్‌ జూబ్లీ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.