close

తాజా వార్తలు

Updated : 23/10/2020 14:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హైదరాబాద్‌ జట్టుకు 2013 తర్వాత ఇప్పుడే

2018 తర్వాత విజయ్‌ శంకర్‌కు తొలిసారి

(Photo Vijay Shankar Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: రాజస్థాన్‌తో తలపడిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ బ్యాట్స్‌మెన్‌ విజయ్‌ శంకర్‌(52*), మనీష్‌ పాండే(83*) అర్ధశతకాలతో రాణించారు. వీరిద్దరూ చివరి వరకు క్రీజులో ఉండి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ఈ క్రమంలోనే 140 పరుగుల భాగస్వామ్యం జోడించడం విశేషం. 2013 తర్వాత హైదరాబాద్‌ టీమ్‌కు ఇద్దరు భారత బ్యాట్స్‌మెన్‌ శతక భాగస్వామ్య పరుగులు చేయడం ఇదే తొలిసారి. ఈ మధ్యలో 23 సార్లు శతక భాగస్వామ్యాలు చేసినా అందులో ఒక విదేశీ ఆటగాడు ఉన్నాడు. దీంతో మనీష్‌, విజయ్‌ కొత్త రికార్డు నెలకొల్పారు. మరోవైపు విజయ్‌ శంకర్‌ 2018 సీజన్‌లో చివరిసారి అర్ధశతకం బాదాడు.

అప్పుడు దిల్లీకి ఆడిన అతడు చెన్నైతో తలపడిన మ్యాచ్‌లో 54 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయితే ధోనీసేన విజయం సాధించింది. గతేడాది నుంచీ హైదరాబాద్‌ తరఫున ఆడుతున్న విజయ్‌ ఇప్పుడు మళ్లీ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన విజయ్‌ తన ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. మనీష్‌తో కలిసి తాను మ్యాచ్‌ను విజయ తీరాలకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. తామిద్దరం బ్యాటింగ్‌ చేసేటప్పుడు ఇదే విషయాన్ని చర్చించుకున్నామని, క్రీజులో పాతుకుపోయి విజయం సాధించాలనే పట్టుదలతో ఆడినట్లు పేర్కొన్నాడు. ఇది వ్యక్తిగతంగా తనకు డూ ఆర్‌ డై పరిస్థితి అని, ఇలాంటి ప్రదర్శనతో ఆత్మవిశ్వాసం కలుగుతుందని చెప్పాడు. తాను కూడా ధాటిగా ఆడి మనీష్‌పై ఒత్తిడి తగ్గించాలనుకున్నట్లు విజయ్‌ వివరించాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.