కోహ్లీ.. తర్వాతే మోదీ.. 
close

తాజా వార్తలు

Updated : 15/12/2020 10:35 IST

కోహ్లీ.. తర్వాతే మోదీ.. 

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎప్పుడూ క్రికెట్‌ మైదానంలో పరుగులూ, శతకాలతో రికార్డులు నెలకొల్పే టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఈమధ్య సామాజిక మాధ్యమాల్లో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. తాజాగా అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అద్భుత రికార్డు నమోదు చేసినట్లు ‘హైప్‌ ఆడిటర్‌’ అనే ప్రపంచవ్యాప్త సమాచార సేకరణ, విశ్లేషణా సంస్థ ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో విరాట్‌ 12వ స్థానంలో నిలిచాడని, అతడి తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 20వ స్థానంలో.. కోహ్లీ సతీమణి, బాలీవుడ్‌ నటి అనుష్కశర్మ 26వ స్థానంలో నిలిచారని ఆ సంస్థ వెల్లడించింది. దీంతో భారత్‌ తరఫున టీమ్‌ఇండియా సారథే అగ్రస్థానంలో నిలిచాడని అర్థమవుతోంది.

ఇక ఈ జాబితాలో ఫుట్‌బాల్‌ స్టార్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో మెదటి స్థానంలో నిలవగా, లియోనెల్‌ మెస్సీ నాలుగో స్థానంలో నిలిచాడని చెప్పింది. భారత్‌ తరఫున కోహ్లీ, మోదీ, అనుష్క తర్వాత మరో బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణే 49వ స్థానంలో నిలిచారని వివరించింది. మరోవైపు విరాట్‌.. ఈ ఏడాది భారత క్రీడాకారులందరిలో ఎక్కువ మంది ట్విటర్ వేదికగా ప్రస్తావించిన ఆటగాడిగా నిలిచాడని ట్విటర్‌ ఇండియా తాజాగా వెల్లడించింది. ఈ జాబితాలో అతడు.. మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ, ఓపెనర్‌ రోహిత్‌శర్మను వెనక్కినెట్టినట్లు చెప్పింది. మహిళా క్రీడాకారుల జాబితాలో రెజ్లర్‌ గీతా ఫొగాట్ టాప్‌లో నిలవగా.. బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ తర్వాతి స్థానాల్లో నిలిచారని పేర్కొంది. అలాగే కోహ్లీ.. ఈ ఏడాది ఆగస్టులో తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు చేసిన ట్వీట్‌ అత్యధిక లైకులు సాధించింది.

ఇవీ చదవండి..

తొలి టెస్టులో ఎవరెవరు?

టాప్‌లో కోహ్లీ‌: తర్వాత ధోనీ, రోహిత్


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని