Virat Kohli: విరాటా?.. ప్రొఫెసరా? 

తాజా వార్తలు

Published : 25/05/2021 10:01 IST

Virat Kohli: విరాటా?.. ప్రొఫెసరా? 

దిల్లీ: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి దాదాపుగా ప్రముఖ వెబ్‌ సిరీస్‌ ‘మనీ హైస్ట్‌’లోని ప్రొఫెసర్‌లా కనిపిస్తున్నాడు.. విరాట్‌ కాదు ప్రొఫెసర్‌.. ‘ప్రొఫెసర్‌ హైస్ట్‌’ నుంచి కోహ్లి మొదటి లుక్కు వచ్చేసింది.. ఇలాంటి నెటిజన్ల వ్యాఖ్యలే సోమవారం నుంచి సామాజిక మాధ్యమాలను ఊపేస్తున్నాయి. కోహ్లి కొత్త అవతారంలో దర్శనమివ్వడమే అందుకు కారణం. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ పర్యటన కోసం ముంబయిలో క్వారంటైన్‌లో ఉన్న అతని కొత్త లుక్కు ఇదేనంటూ ఓ ఫొటో బయటకు వచ్చింది. గుబురు గడ్డంతో, పొడవైన జుట్టుతో ఉన్న అతను కళ్లద్దాలు పెట్టుకుని కనిపించాడు. దీంతో ‘మనీ హైస్ట్‌’లోని ప్రొఫెసర్‌లా ఉన్నాడంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. వాళ్ల ఇద్దరి ఫొటోలు పక్కపక్కన పెట్టి పోస్టు చేస్తున్నారు. మరోవైపు సౌథాంప్టన్‌లో న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం కోహ్లి ఇలా సిద్ధమవుతున్నాడనే వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. కానీ అది ఫొటోషాప్‌లో ఎడిట్‌ చేసిన చిత్రమని తర్వాత నిజం తెలిసింది.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని