
తాజా వార్తలు
కోహ్లీ ఖాతాలో మరో రికార్డు
ఇంటర్నెట్‌డెస్క్: టీమిండియా సారథి విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 22వేల పరుగులు సాధించిన ఎనిమిదో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో విరాట్ ఈ ఘనత అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 89 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అయితే అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో విరాట్ ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ (34,357 పరుగులతో) ఉన్నాడు. తర్వాతి స్థానాల్లో కుమార సంగక్కర్, రీకీ పాంటింగ్, జయవర్ధనే, కలిస్, రాహుల్ ద్రవిడ్, లారా ఉన్నారు. కాగా, అత్యధిక శతకాలు సాధించిన ఆటగాళ్లలో సచిన్ (100), పాంటింగ్ (71) తర్వాత కోహ్లీ (70) ఉన్నాడు.
అంతేగాక నేటి మ్యాచ్‌లో కోహ్లీ మరో రికార్డు సాధించాడు. భారత్ తరఫున 250 వన్డేలకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాడిగా నిలిచాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ 51 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లకు 389 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (104) మెరుపు శతకం సాధించాడు. అనంతరం ఛేదనకు దిగిన టీమిండియా తొమ్మిది వికెట్లు కోల్పోయి 338 పరుగులకు పరిమితమైంది. విరాట్ కోహ్లీ (89), కేఎల్ రాహుల్ (76) అర్ధశతకాలతో పోరాడారు. కాగా, మూడు వన్డేల సిరీస్‌లో చివరి నామమాత్రపు మ్యాచ్ కాన్బెర్రా వేదికగా బుధవారం జరగనుంది.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- కొత్త అధ్యక్షుడి తీరని కోరిక!
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..15 మంది మృతి
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
- భద్రతా సిబ్బంది నుంచే ముప్పు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
