మయాంక్‌.. విరాట్‌ సాయంతో!

తాజా వార్తలు

Published : 13/12/2020 07:53 IST

మయాంక్‌.. విరాట్‌ సాయంతో!

సిడ్నీ: ఆస్ట్రేలియా-ఎతో మూడు రోజుల వార్మప్‌ మ్యాచ్‌లో పాల్గొనకపోయినా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సహచరులకు మార్గదర్శిగా వ్యవహరిస్తున్నాడు! నెట్స్‌లో సూచనలు, సలహాలు ఇస్తూ లోపాలను దిద్దుతున్నాడు. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ టెక్నిక్‌ను అతను అలాగే సరి చేశాడని స్థానిక దినపత్రిక తెలిపింది. వన్డే సిరీస్‌లో షార్ట్‌ పిచ్‌ బంతులకు ఇబ్బందిపడిన అగర్వాల్‌.. నెట్‌ సెషన్లో బుమ్రాను సరిగా ఎదుర్కోలేకపోయాడు. తాజాగా ఐపీఎల్‌లోనూ మయాంక్‌ను బుమ్రా రెండుసార్లు బౌల్డ్‌ చేశాడు. ఈ నేపథ్యంలో షార్ట్‌ పిచ్‌ బంతిని వదిలేసేటప్పుడు ఎప్పటిలా కాకుండా చేతులు ఇంకాస్త పైకి లేపాలని విరాట్‌ సూచించాడట. ఎగసి పడే బంతులను ఎదుర్కొనే సమయంలో పూర్తి నియంత్రణతో ఉండేందుకు వెనుక పాదం పైకి లేవకుండా చూసుకోవాలని తెలిపాడని ఆ పత్రిక పేర్కొంది! సుదీర్ఘ సమయం విరాట్‌తో గడిపిన ఆ నెట్‌ సెషన్‌ మయాంక్‌కు ఫలితాన్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆసీస్‌-ఎతో రెండో వార్మప్‌ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 2 పరుగులే చేసిన మయాంక్‌.. రెండో ఇన్నింగ్స్‌లో విశ్వాసంతో ఆడి 61 పరుగులు సాధించాడు. మరోవైపు నెట్‌ బౌలర్లు నటరాజన్, శార్దూల్, వాషింగ్టన్‌ సుందర్, కార్తీక్‌ త్యాగిలను టెస్టు సిరీస్‌ ముగిసే వరకు జట్టుతో ఉండాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ సూచించింది. 

ఇవీ చదవండి..

రోహిత్‌ అక్కడికి వెళ్లాక...

శతక్కొట్టారు

మీ ఇంట్లోవాళ్లు అదే చెబుతున్నారు: ధావన్


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని