
తాజా వార్తలు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
సిడ్నీ: మరికొద్దిసేపట్లో టీమ్ఇండియా, ఆస్ట్రేలియా జట్లు తొలి వన్డే ఆడనున్నాయి. సిడ్నీ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, 9 నెలల సుదీర్ఘ విరామం తర్వాత భారత్ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడనుండటం విశేషం. మార్చి 2న న్యూజిలాండ్‌తో చివరి టెస్టు ఆడిన కోహ్లీసేన తర్వాత మరే జట్టుతోనూ క్రికెట్ ఆడకపోవడం తెలిసిన సంగతే. ఇక మార్చిలో దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉన్నా అది కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. లాక్డౌన్ తర్వాత యూఏఈలో ఐపీఎల్ ఆడిన భారత ఆటగాళ్లు అక్కడి నుంచి నేరుగా ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండి ఇప్పుడు కీలక పోరుకు సిద్ధమయ్యారు.
భారత జట్టు: శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, యుజువేంద్ర చాహల్, నవదీప్ సైనీ, మహ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా
ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), స్టీవ్‌స్మిత్, గ్లెన్‌మాక్స్‌వెల్, మార్నస్ లబుషేన్, మార్కస్ స్టాయినిస్, అలెక్స్ క్యారీ, పాట్‌కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, ఆడం జంపా
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఇన్‌కాగ్నిటో నిజంగా పనిచేస్తుందా?
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- బన్నీకి జోడీగా బాలీవుడ్ హీరోయిన్?
- మోనాల్ గజ్జర్ చిందేసిన ఐటమ్ సాంగ్ చూశారా?
- తమన్నా చీట్: సాయేషా డ్యాన్స్: మంచు కుటుంబం
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
- ప్లాస్టిక్ లేకుండా... ఇలా చేయొచ్చు!!
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- సాహితీవేత్త రుద్రశ్రీ కన్నుమూత
- మెగా కాంపౌండ్‌లో మ్యూజికల్ నైట్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
